తెలంగాణలోని కాంగ్రెస్( Congress ) ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్( BJP leader Bandi Sanjay ) తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్ వందల రోజుల డెడ్ లైన్ ముగిసిందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.మహిళలకు ప్రతినెల రూ.2,500 ఎందుకు జమ చేయలేదో చెప్పాలన్నారు.రైతు భరోసా రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదన్న బండి సంజయ్ పెన్షన్ రూ.4 వేలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.