డీ-మార్ట్ షోరూమ్ తెలియని భారతీయులు ఉండరనే చెప్పుకోవాలి.మధ్య తరగతి వాడి మార్ట్ గా పేరుపొందిన డీ-మార్ట్ అతి తక్కువ కాలంలోనే బాగా వృద్ధి చెందింది.
అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో డీ-మార్ట్ గ్రాఫ్ పడిపోతుంది.నాణ్యత లేని సరుకులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
అధికారులు అనేక సార్లు జరిమానాలు విధించినా ఆ సంస్థలో పెద్దగా మార్పు కనబడటం లేదని తెలుస్తోంది.వినియోగదారులకు నాసికరం సరుకులను అంటగడుతున్నారు అనే విషయాలు ఈమధ్య ప్రూవ్ అయ్యాయి.
ఇక తాజాగా కుషాయిగూడలోని డీ-మార్ట్ స్టోర్‌లో నాసిరకం సరుకులు బయటపడ్డాయి.ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది.సంబంధిత అధికారులు వెంటనే రంగంలో దిగి డీ-మార్ట్ సంస్థపై అక్షరాలా 30,000 రూపాయల జరిమానా విధించారు.వాసవీనగర్‌కు చెందిన శేఖర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి డీ మార్ట్ సంస్థకు వెళ్లాడు.
సరుకులు కొన్న తర్వాత బయటకు వచ్చి కొన్న ఖర్జూరం ప్యాకెట్ విప్పి చూడగా అందులో పురుగులు కనిపించాయి.స్టోర్ సిబ్బందిని ఈ విషయమై నిలదీయగా.
వారు దురుసుగా సమాధానం చెప్పారు.వెంటనే తాను నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి సంక్షేమ సంఘాల నాయకులకు విషయం వివరించాడు.
దాంతో వారిలో కొందరు శేఖర్‌తో పాటు డీ-మార్ట్ స్టోర్‌కు వెళ్లి, అక్కడే బైఠాయించారు.తరువాత కాప్రా సర్కిర్ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.కాప్రా సర్కిల్ నుంచి AMOH డాక్టర్ స్వప్న అక్కడకు వచ్చి, సరుకులను పరిశీలించారు.ఖర్జూరం ప్యాకెట్లతో పాటు కందిపప్పు ప్యాకెట్లను కూడా పరిశీలించి చూడగా అందులో కూడా పురుగులు ఉన్నట్లు గుర్తించి స్టోర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరువాత అక్కడ వున్న మొత్తం సరుకులను సీజ్ చేశారు.బాధ్యతారాహిత్యంతో నడుచుకున్నందుకు వారికి 30,000 రూపాయల జరిమానా విధించారు.