యంగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.అయితే అలాంటి విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు.
అయితే ఈయన చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హిట్ అవ్వడంతో విశ్వక్ సేన్ కి మంచి గుర్తింపు వచ్చింది.ఇక తాజాగా యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన బబుల్గం ( Bubblegum ) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఇక ఈవెంట్లో సిద్దు జొన్నలగడ్డ,అడివి శేష్ తో పాటు విశ్వక్ సేన్ కూడా సందడి చేశారు.అయితే ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్ వేసుకొని వచ్చిన చెప్పులు అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
అయితే ఈ చెప్పుల పై చాలామంది జోక్స్ కూడా వేశారు.

ఇక సుమ ( Suma ) అయితే అవి షూస్ ఏనా బాబు.మాకు అవి ఇస్తే మేము బట్టలు దాచిపెట్టుకుంటాం అంటూ సెటైర్లు కూడా వేసింది.అయితే ఈ ఈవెంట్ లో స్టేజిపై హబీబీ జిలేబి అనే పాటకి డాన్స్ చేయవలసిందిగా కోరారు సుమ.అయితే సిద్దు,అడివి శేష్ ఇద్దరూ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ విశ్వక్ సేన్ మాత్రం తన చెప్పులు చూయించి నేను చేయలేను అని అన్నారు.దాంతో సుమ ఆ సెటైర్ వేసింది.
ఇక విశ్వక్ సేన్ వేసుకున్న చెప్పులు నలుపు రంగులో ఉన్నాయి.

అయితే అవి చెప్పుల్లా కాకుండా చాలా వెరైటీగా క్లాగ్స్ లా ఉన్నాయి.అయితే ఈ చెప్పులు ఎత్తుగా ఉండడంతో విశ్వక్ సేన్ కాస్త పొడవుగా కనిపించారు.అలాగే ఈయన వేసుకున్న చెప్పులకు నెంబర్ ప్లేట్స్ లాగా మెటల్ ప్లేట్ పై ఆ బ్రాండ్ నేమ్ రాసి ఉంది.
ఇక విశ్వక్ సేన్ ( Vishwak Sen) వేసుకున్న చెప్పులు 104 ఏళ్ల క్రితం స్పెయిన్ లో పుట్టిన ఓ లగ్జరీ బ్రాండ్ అని తెలుస్తుంది.ఇక ఈ సంస్థని ప్రస్తుతం ఫ్రాన్స్ ( France ) కు చెందిన లగ్జరీ గూడ్స్ సంస్థ కెరింగ్ దీన్ని చూసుకుంటుంది.
ఇక విశ్వక్ సేన్ వేసుకున్న బలెన్సియాగా హార్ట్ క్రాక్ విలువ అమెరికన్ డాలర్స్ ప్రకారం 1190 డాలరస్.అయితే ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు లక్ష అంటే 98,975 రూపాయలు అని తెలుస్తోంది.
ప్రస్తుతం విశ్వక్ సేన్ తన కాళ్ళకి లక్ష రూపాయల చెప్పులు ధరించారు అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.