కౄర జంతువుల వద్దకు వెళ్లడం ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందని చెప్పవచ్చు.ఆ కౄర జంతువు సింహం లేదా పులి అయితే, ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే ఎందుకంటే ఇవి కొంచెం చిరాకు తెప్పించినా మెడ కొరికేసి చంపేస్తాయి.
ముఖ్యంగా అడవికి రాజు సింహం భారీ పంజా, నోటితో మనుషులను క్షణాల్లో చంపేయగలదు.అందుకే వీటితో పరాచికాలు ఆడకూడదు.
కానీ ఒక వ్యక్తి ఏకంగా బాక్సింగ్( Boxing ) ఆడేశాడు.దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

వైరల్ వీడియోలో ( Viral video )మానవుడు, సింహం( Lion ) పోట్లాడుకోవడం మనం చూడవచ్చు.బాక్సింగ్ లో ఆ వ్యక్తి సింహాన్ని పడేస్తూ దానిని కొట్టేస్తూ కనిపించాడు సింహం కూడా తన పంజాలతో అతడిని తిన్నితంగా కొట్టింది.కొన్నిసార్లు సింహం అతనిని ఓడించినట్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు అతను సింహంపై ట్రై చేయి సాయదించినట్లు అనిపిస్తుంది.
అతను సింహాన్ని ఎత్తుకుని కిందపడేస్తాడు కూడా, కానీ సింహం ఓడిపోవడానికి అసలు ఒప్పుకోదు.వెంటనే లేచి నిలబడి మళ్ళీ అతడితో తలపడుతుంది.

ఈ దృశ్యాలు చూసేందుకు షాకింగ్ గా అనిపించాయి.సింహానికి కోపం వచ్చి, అతడిని చంపేయడానికి ప్రయత్నిస్తే ఇంకా ఏమైనా ఉందా అని చాలామంది ఈ వీడియో చూసి తమ భయాన్ని వ్యక్తం చేశారు.అయితే ఆ సింహాన్ని సదరు వ్యక్తి చిన్నప్పటినుంచి పెంచుకుంటున్నట్లున్నాడు, అందుకే అది పోరాడకుండా సరదాగా ఆడుకుంటుంది.అదే పోరాడితే మళ్లీ సెకండ్లలో అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని ఒక వ్యక్తి అన్నారు.
ఈ అరుదైన బాక్సింగ్ వీడియోను @historyinmemes అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియో 1930 నాటిదని చెబుతున్నారు.ఒక నిమిషం 9 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటికే 2 కోట్ల 48 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.1,50,000 దాకా లైక్స్ వచ్చాయి ఏదైనా మీరు కూడా చూసేయండి.







