పుతిన్( Putin ) ప్రైవేట్ సైన్యంగా పేరుగాంచిన వాగ్నర్ గ్రూప్ ( Wagner Group )ఏకంగా పుతిన్‌పై తిరుగుబాటు చేసిన తరువాత హాట్ టాపిక్ అయ్యారు.అయితే రష్యా అధ్యక్షుడుపై తిరుగుబాటు చేసిన కొద్ది క్షణానికే వీరు లొంగిపోయిన విషయం అందరికీ తెలిసినదే.
ఆ తరువాత వాగ్నర్ గ్రూప్ చీఫ్ అయినటువంటి “యెవ్జెనీ ప్రిగోజిన్”( Yevgeny Prigozhin ) కనిపించకుండా పోయారు.ఈ విషయం అనేక అనుమానాలు వున్న నేపథ్యంలో అమెరికా మాజీ సైనిక అదికారి రాబర్ట్ అబ్రమ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యెవ్జెనీ అయితే చనిపోయి ఉండాలి, లేదంటే జైలులో ఉండాలి… అది కూడా లేదంటే ఆయనని అత్యంత కర్కశంగా చంపేసి ఉండాలి! అని ఆయన అన్నారు.కాగా ఈ వ్యాఖ్యలు నేడు అంతర్జాతీయ వేదికపైన హాట్ టాపిక్ అయ్యాయి.

ఆ తిరుగుబాటు జరిగిన 5 రోజుల తర్వాత మెర్సెనరీ గ్రూప్ చీఫ్‌ను పుతిన్ కలిశారని రష్యా( Russia ) నుంచి ప్రకటన వచ్చిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రత్యేకతని సంతరించుకుంది.ఓ మీడియా వేదికగా అమెరికా మాజీ జనరల్ రాబర్ట్ అబ్రమ్స్ మాట్లాడుతూ… “మనం ప్రిగోజిన్‌ని మళ్లీ బహిరంగంగా చూస్తామా, లేదా అనే విషయంపైన నాకు సందేహం ఉంది.ఆయనను అజ్ఞాతంలో ఉంచారా లేదా జైలుకు పంపారా లేదా మరే విధంగానైనా వ్యవహరించారోనని నేను అనుకుంటున్నాను.నాకు అనుమానంగానే వుంది!” అంటూ పరోక్షంగా అయ్యాయని ఈపాటికే చంపేసి ఉంటారని వ్యాఖ్యలు చేసాడు.

ఇకపోతే, ఈ వారం ప్రారంభంలో ప్రిగోజిన్( Prigogine ), అతని వ్యక్తులు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారని, సాయుధ తిరుగుబాటు జరిగిన 5 రోజుల తర్వాత ప్రభుత్వానికి విధేయత చూపారని రష్యా చెప్పుకొచ్చింది.ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ మాత్రమే కాకుండా అతని వాగ్నర్ గ్రూప్ మిలిటరీ కాంట్రాక్టర్ నుంచి కమాండర్లు కూడా పాల్గొన్నారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్( Dmitry Peskov ) చెప్పుకొచ్చారు.కాగా మిలిటరీ నాయకత్వ మార్పును కోరుతూ గత నెలలో మాస్కోకు మార్చ్‌లో దళాలకు నాయకత్వం వహించిన ప్రిగోజిన్‌తో పుతిన్ ముఖాముఖిగా సమావేశమయ్యారని చెప్పడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్‌ను దేశద్రోహిగా ముద్రవేసి, కఠిన శిక్ష విధిస్తానని పుతిన్ ప్రమాణం చేశారు.
అందుకే ప్రస్తుతం అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.