ఏపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం అవసరమని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.అప్పటివరకు ఏపీ రాష్ట్ర ప్రజలను కేంద్ర ప్రభుత్వం రక్షించాలని కోరారు.
విభజన కంటే సీఎం జగన్ పాలనలోనే ఏపీ ఎక్కువగా నష్టపోయిందని ఎంపీ కనకమేడల ఆరోపించారు.వైసీపీ పాలనలో ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.
సంక్షేమం పేరుతో రూ.లక్షల కోట్లు అప్పులు తెస్తూ జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.