తెలుగులో పలు చిత్రాలలో తల్లి పాత్రలలో నటించి ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకున్న “సీనియర్ నటి నిర్మల” గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈమె పేరు సినిమా పరిశ్రమలోకి రాకముందు శాంతి.
కానీ తమిళ ప్రముఖ దర్శకుడు శ్రీ సివి శ్రీధర్ దర్శకత్వం వహించిన “వెన్నిరాడై” చిత్రంలో నటించగా ఆ చిత్రం మంచి హిట్ అయ్యింది.దీంతో అప్పటి నుంచి వెన్నిరాడై నిర్మల అని అందరూ పిలుస్తున్నారు.
ఇప్పుడు సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం..
నటి వెన్నిరాడై నిర్మల తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం ప్రాంతంలో పుట్టి పెరిగింది.నిర్మలకు చిన్నప్పటి నుంచే నాటకాలు మరియు నాట్యంపై ఆసక్తి ఉండటంతో ఆమె తల్లిదండ్రులు భరత నాట్యంలో శిక్షణ కూడా ఇప్పించారు.
దాంతో ఈమె దేశం వ్యాప్తంగా అప్పట్లో పలు నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది.ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఇప్పటివరకు వెన్నిరాడై నిర్మల పలు కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు.
అయితే ఇందుకు ఎక్కువగా వెన్నిరాడై నిర్మల అప్పట్లో ఓ తమిళ సీనియర్ హీరోని ప్రేమించిందని కానీ ఆ ప్రేమ పెళ్లికి దారి తీయకుండానే పెటాకులైందని అందువల్లే ఇప్పటివరకు నటి వెన్నిరాడై నిర్మల పెళ్లి చేసుకోలేదని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.దీనికి తోడు నటి వెన్నెరాడై నిర్మల కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆసక్తి చూపక పోవడంతో ఇప్పటివరకు ఈమె ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండి పోయిందో సరైన కారణాలు తెలియడం లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి వెన్నిరాడై నిర్మల తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా రెండు వందలకు పైగా చిత్రాలలో నటించింది.అలాగే తమిళ భాషలో 3 సీరియళ్లలో కూడా నటించింది.
అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎంజీఆర్ పార్టీ కి రాజకీయ పరంగా సేవలు కూడా అందించింది.