తెలుగమ్మాయిలకి డబ్బులు ఇవ్వాలంటే ఏడుస్తారు.. కానీ ముంబై హీరోయిన్లకు మాత్రం...

2018 వ సంవత్సరంలో టాలీవుడ్ దర్శకుడు కృష్ణ కార్తిక్ దర్శకత్వం వహించినటువంటి హెచ్.బి.డి (హ్యాక్డ్ బై డెవిల్) అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు అమ్మాయి మేఘన చౌదరి తన నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.అయితే తాజాగా మేఘన చౌదరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది.

 Meghana Chowdary, Telugu Actress, Sensational Comments, Telugu Heroines Remunera-TeluguStop.com

ఇందులో భాగం గా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిలకు ఇచ్చే పారితోషికం విషయం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇందులో ముఖ్యంగా గా తెలుగు అమ్మాయిలుకు పారితోషకం ఇవ్వాలంటే దర్శక నిర్మాతలు బేరసారాలు చేస్తారని కానీ అదే ముంబై హీరోయిన్లకు అయితే కోట్లలో పారితోషకం ఇవ్వడానికి రెడీగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఈ తారతమ్యాలు ఒక పారితోషకం విషయంలోనే కాదని అవకాశాల విషయంలో కూడా ఉన్నాయని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అందుకు ఉదాహరణగా తెలుగు హీరోయిన్లకు వసతులు కల్పించేందుకు దర్శక నిర్మాతలు వెనుకాడుతారని కానీ కానీ ముంబై హీరోయిన్లకు మాత్రం విమాన టికెట్ల నుంచి క్యరావ్యాన్ వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటారని, తనకు ఇప్పటికీ తెలుగు ఆర్టిస్టుల విషయంలో అంత వివక్ష ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదని వాపోయింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది మేఘన చౌదరి టాలీవుడ్ దర్శకుడు శ్యామ్ జే చైతన్య దర్శకత్వం వహించిన ఏడు చేపల కథ అనే చిత్రంలో కొంతమేర బోల్డ్ తరహాలో కనిపించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.

అయినప్పటికీ పట్టు విడవకుండా అవకాశాల కోసం సినీ పరిశ్రమలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube