కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు విజయ్ దళపతి.
ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈయన సినిమాలు కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తాయి.
అయితే ఇప్పుడు విజయ్ తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టాడు.ఎందుకంటే ఇప్పటి వరకు డైరెక్ట్ తమిళ్ సినిమాలు చేసిన విజయ్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తూ అందరికి షాక్ ఇచ్చాడు.
ఇక్కడ సినిమా చేయడంతో ఈయన ఇక్కడ మార్కెట్ మరింత పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.అందుకే టాలీవుడ్ డైరెక్టర్ తో విజయ్ తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ప్రెసెంట్ విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.
దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.
వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రివీల్ చేసారు.ఇందులో విజయ్ సూటు బూటు తో స్టైలిష్ గా కనిపించాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో
విజయ్ రోల్
గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ సినిమాలో విజయ్ ఫుడ్ యాప్ డిజైనర్ గా కనిపిస్తాడట.అంతేకాదు ప్లాష్ బ్యాక్ లో కాలేజ్ కు వెళ్లే విద్యార్థిగా కూడా విజయ్ కనిపించ నున్నట్టు తెలుస్తుంది.
ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.