ప్రస్తుతం తెలుగు సిని ఇండస్ట్రీలో ఎక్కువగా మారుమోగుతున్న పేర్లలో సింగర్ శ్రావణ భార్గవి పేరు కూడా ఒకటి.ఈమె అన్నమయ్య కీర్తనలు అపహస్యం చేసిందని, అన్నమయ్య కీర్తనలను తన అందాన్ని అభివర్ణించడం కోసం ఉపయోగించింది అంటూ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే విషయంఫై అన్నమాచార్యుల పెద్ద కుమారుడు తిరుమలాచార్యులు స్వామివారికి అభిషేక కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి అపహాస్యం చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముఖ్యంగా ఈ పాటలో శ్రావణ భార్గవి అభినయం వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు పైకి లేపి ఊపుతూ జంతికెలు తింటూ పాడి చిత్రీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై టీటీడీ, అలాగే అన్నమాచార్యుల కుటుంబ సభ్యులు,టీటీడీ భక్తులు ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా ఆ విషయం పై స్పందించిన శ్రావణ భార్గవి.
తప్పు చూసే కళ్లతో ఉంది కానీ తన పాటలో తప్పేంలేదని పాటను డిలీట్ చేయనని ఒకవేళ తాను నిజంగా తప్పు చేసి ఉంటే ఆ అమ్మవారే తన పాటను యూట్యూబ్ నుంచి తీయించేస్తారని చెప్పింది శ్రావణ భార్గవి.
ఇదే విషయంపై సినీ నటి కరాటే కళ్యాణి స్పందించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.భక్తి పాటలు రెండు కాళ్లు పైకి ఎత్తి ఊపుతూ పాడతారా? హిందూ ధర్మం ప్రకారం పెళ్లైన అమ్మాయి తాళి లేకుండా బొట్టులేకుండా మెట్టెలు లేకుండా ఉంటారా? ఇవేమీ శ్రావణ భార్గవి పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకోలేదో నాకు అర్ధం కావడం లేదు.ఇవేమీ లేకుండా కాళ్లు పైకి కీర్తనలు పాడతానంటే కుదురుతుందా? మీ పైత్యాన్ని భక్తి పాటల్లో చూపిస్తే మేం ఊరుకోము అంటూ ఘాటుగా స్పందించింది కరాటే కళ్యాణి.సాంగ్ డిలీట్ చేయనని అంటుంది.

నా ఇష్టం నువ్వెవరు నాకు చెప్పడానికి అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది అని తెలిపింది కరాటే కళ్యాణి.అయితే అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేయడం మంచి పద్దతి కాదు.ఆమెది తప్పు అని అనడంలేదు.
కానీ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అంటున్నాం.మా మాట వింటే బాగుపడుతుంది.
ఆమెతో నాకు పరిచయం కూడా ఉంది.కొన్ని కొన్ని వివాదాలు అనుకోకుండా వచ్చేస్తాయి అని తెలిపింది కరాటే కళ్యాణి.
అయితే నేను బ్రాహ్మిణ్.నేను హిందూ.
నేను తప్పేం చేశాను అంటే ఎలా? నాకు ఇష్టం వచ్చినట్టు పాడుతా…నాకి ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే మాత్రం కుదరదు.కాళ్లు రెండు పైకి ఎత్తుతానంటే కుదరదు.
భక్తి పాటను భక్తితోనే పాడాలంటూ అంటూ ఘాటుగా స్పందించిది కరాటే కళ్యాణి.







