టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా తర్వాత విడుదలైన సినిమా ఆర్‌ఆర్‌ఆర్.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తెలిసిందే.
కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఒలీవియా మోరిస్ కూడా హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలు ఏ రేంజ్ లో ప్రభంజనాన్ని సృష్టించాయో మనందరికీ తెలిసిందే.
బాహుబలి సినిమా తర్వాత దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కూడా అంతకుమించి అన్న విధంగా తెరకెక్కించారు.అంతేకాకుండా బాహుబలి సినిమా తర్వాత ఇండియన్ సినిమాను మరొక రేంజ్ కీ తీసుకెళ్లిన సినిమా ఇది.ఏడాది మార్చి 25న విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా విడుదలైన మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది.అలా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డులను సృష్టించింది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా కూడా ఈ సినిమా క్రేజీ ఇంకా తగ్గలేదు.ఇదిలా ఉంటే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జపాన్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ నేపథ్యంలోనే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను అక్టోబర్ 21వ తేదీన జపాన్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా మరి జపాన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి మరి.







