హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
వైఎస్ షర్మిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు పీఎస్ వద్ద నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో నిరసనకారులను వారించిన పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం.
మరోవైపు పీఎస్ లో ఉన్న షర్మిలను కలిసేందుకు వైఎస్ విజయమ్మ రానున్నారు.అయితే వైఎస్ విజయమ్మను లోటస్ పాండ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన షర్మిలను అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే.