బుల్లితెర నటి అభిమానులకు షాక్.. ఇన్ స్టాగ్రామ్ పోస్టులు అన్నీ డిలీట్!

బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి అయినా నిక్కీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ససురాల్ సిమర్ కా, బ్రహ్మరాక్షస్ 2 ఇలాంటి సీరియల్స్ లో నటించి తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది నిక్కీ శర్మ.

 Tv Actress Nikki Sharma Deleted Her Instagram Posts , Nikki Sharma , Instgram ,-TeluguStop.com

అయితే నటన పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిక్కి శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇలా ఉంటే తాజాగా నిక్కి శర్మ తన అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టులు అన్నీ కూడా డిలీట్ చేసింది.దీనితో నిక్కీ శర్మ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

అయితే తన ఇంస్టాగ్రామ్ లో పోస్టులను డిలీట్ చేయడమే కాకుండా అనంతరం ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక మెసేజ్ ను కూడా పెట్టింది.నేను ప్రయత్నించాను.కానీ అలసిపోయాను.నా సొంత ఆలోచనల నుంచి విముక్తి పొందాలి అనుకుంటున్నాను అని రాసుకొచ్చింది నిక్కి శర్మ.

ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ పోస్ట్ చూసిన అభిమానులు సన్నిహితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నిక్కీ శర్మ ఎందుకు ఈ విధంగా చేస్తోంది అని ఆలోచనలో పడ్డారు.ఇదే విషయంపై ససురాల్ సిమర్ కా సీరియల్ నటుడు, అలాగే నిక్కీ శర్మ మాజీ సహ ఉద్యోగి అయిన అభిషేక్ భలే రావు స్పందించాడు.

Telugu Bollywood, Brahmarakshas, Instgram, Instgram Delete, Nikki Sharma-Movie

నిక్కీ శర్మ పోస్ట్ లని డిలీట్ చేయడం పట్ల అతను కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.ససురాల్ సిమర్ కా సీరియల్ లో తనతోపాటు కలిసి నటించిన నిక్కీ శర్మ తన పోస్టులను తొలగించిందని,ఆమె రాసిన మెసేజ్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో మూడు గంటలకు పైగా ఉందని, నేను ఈ మెయిల్, అలాగే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా సాధ్యమైనంతవరకూ ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అందుబాటులోకి రాలేదు అని తెలిపారు.అయితే నిక్కీశర్మ మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదని, ఆమె నిరాశకు గురైనట్లు ఆమె సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం అని ప్రముఖ వెబ్ సైట్ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube