1.హెచ్ 1 బి వీసా పై బైడన్ తో భారత ప్రధాని చర్చ

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా హెచ్ వన్ బీ వీసా గురించి వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
2.ప్రవాసులకు సౌదీ హెచ్చరిక
రీ ఎంట్రీ వీసా పై సౌదీ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రవాసులకు సౌదీ అరేబియా లోని పాస్పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ కీలక సూచన చేసింది.వీసా గడువు ముగిసేలోపు తిరిగి సౌదీ రాకపోతే ప్రవాసుల పై మూడేళ్ల బ్యాన్ ఉంటుందని ప్రకటించింది.
3.కాశ్మీర్ అంశంపై బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
యూకే పార్లమెంట్ లో అఖిలపక్ష పార్లమెంటరీ బృందం కాశ్మీర్ లో మానవ హక్కుల గురించి ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది.
ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ డెబ్బీ అబ్రహంస్ దీనిపై చర్చను ప్రారంభించారు.కాశ్మీర్ నుంచి భారత్ బలగాలను ఉపసంహరించుకుంటే ఆ ప్రాంతం మరో ఆఫ్ఘనిస్తాన్ లా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
4.అమెరికా భారత్ కు సహజ భాగస్వామి

భారత్-అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.ఈ రెండు దేశాలకు ఒకే రకమైన విలువలు, భౌగోళిక , రాజకీయ ఆసక్తులు ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
5.కెనడా లో తొలి సాహితీ సదస్సు
సెప్టెంబర్ 25 ,26 తేదీల్లో కెనడా ప్రధాన కేంద్రంగా మొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు , 12 వ అమెరికా సాహితీ సదస్సులను నిర్వహిస్తున్నారు.వర్చువల్ గా జరగబోయే ఈ వేడుకల్లో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలి అని సదస్సు నిర్వాహకులు కోరారు.
6.దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధం : ఉత్తర కొరియా
స్నేహభావంతో ముందుకు వస్తే దక్షిణ కొరియాతో తాము చర్చలకు సిద్ధం అని, ఉత్తర కొరియా అధినేత కిమ్ సోదరి కిమ్ యో జొంగ్ ప్రకటించారు.
7.భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే : బైడన్

ఐక్యరాజ్య సమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే అని , దీనికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ వ్యాఖ్యానించారు.
8.ఐక్యరాజ్య సమితి లో పాకిస్తాన్ కు గట్టి కౌంటర్

ఐక్యరాజ్యసమితిలో భారత్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శలు మొదలుపెట్టగానే , దానికి కౌంటర్ గా భారత ఫస్ట్ సెక్రటరీ స్నేహ దూబే గట్టి కౌంటర్ ఇచ్చారు.భారత భూ భాగంలోని కాశ్మీర్ ను అక్రమించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది అని, వెంటనే తమ భూ భాగం వదిలి వెళ్ళాలి అని హెచ్చరికలు స్నేహ దూబే చేశారు.
9.క్వాడ్ సమావేశం .పాక్ చైనా పై ఆగ్రహం
అమెరికా నేతృత్వంలో క్వాడ్ సభ్య దేశాధినేతలు మొదటిసారి ప్రత్యక్షంగా వైట్ హౌస్ వేదికగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా పాక్ ,చైనా వైఖరిపై మిగతా దేశాలు మండిపడ్డాయి.
10.ఆఫ్ఘన్ లో దారుణమైన శిక్షలు

అఫ్గాన్ లో తాలిబన్లు దారుణమైన శిక్షలు అమలు చేస్తున్నారు .ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులను బహిరంగంగా.కాల్చి క్రేన్లకు వేలాడదీశారు.