1.న్యూ జెర్సీ లో గణేష్ నిమజ్జనం
అమెరికాలో ని న్యూజెర్సీ సాయి దత్త పీఠం గణేష్ నిమజ్జనోత్సవం ని ఘనంగా నిర్వహించింది. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి ఘనంగా నిమజ్జనోత్సవం చేశారు.
2.అమెరికా చేరుకున్న భారత ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు.వాషింగ్టన్ లో ప్రధాని మోదీని ఇండియన్ అమెరికన్లు ఘనంగా స్వాగతించారు.
3.రేవంత్ రెడ్డి పై ఎన్.ఆర్.ఐ టిఆర్ఎస్ విమర్శలు
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడాన్ని ఎన్నారై టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తప్పుపట్టారు.ఈమేరకు రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు.
4. బూస్టర్ డోస్ కు అమెరికా అనుమతి

ఫైబర్ వాక్సిన్ బూస్టర్ డోస్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించింది.
5.ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం
ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
6.అంగారక గ్రహంపై భారీ భూకంపం

అంగారక గ్రహంపై తరచుగా ప్రకంపనలు సంభవిస్తున్నాయి .దీనిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కు చెందిన ఇన్ సైట్ ల్యాండర్ మార్స్ గ్రహం గుర్తించింది.తాజాగా వచ్చిన ప్రకంపనల తీవ్రత 4.2 గా గుర్తించింది.
7.కరోనా టీకా పై ఇండియా బ్రిటన్ మధ్య విభేదాలు
కొవీ షీల్డ్ టీకా విషయంలో బ్రిటన్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది.తమకు టీకా తో ఎటువంటి సమస్య లేదని చెబుతూనే, సర్టిఫికెట్ తోనే సమస్య ఉన్నట్లు ప్రకటించింది.
7.ఆకస్ లో ఇండియా జపాన్ లకు చోటు లేదు

ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ బలాన్ని పెంచుకునేందుకు అమెరికా కొత్తకూటమి ఆకస్ ను ఏర్పాటు చేశారు.ఈ కూటమిలో భారత్ జపాన్ లకు చోటు లేదని అమెరికా ప్రకటించింది.
8.మోదీ అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా లో ఐదు రోజుల పాటు ఉండనున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఆయన ప్రసంగించబోతున్నారు.
9.చైనా కు భారత్ జలక్
భారత్ లోని ఐపీఓ లో చైనా పెట్టుబడులు పెట్టకుండా భారత్ అడ్డుకట్ట వేసింది.భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం చైనా పెట్టుబడులను భారత్ పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
10.చంద్రుడి పై పర్యాటక యాత్ర

చంద్రుడిపై పర్యాటక యాత్ర చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.రాబోయే మూడు నాలుగేళ్లలో చంద్రుడిపై టూరిస్టులు వెళ్లేందుకు రెండు కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.ఎలెన్ మాస్క్, కు చెందిన స్పేస్ ఎక్స్, జెఫ్ బెజొస్ కు చెందిన బ్లూ ఆరిజన్ తో పాటు మరో మూడు కంపెనీలు నాసాతో ఒప్పందం చేసుకున్నాయి.