1.ఇండియా తో స్నేహం కోరుకోవడమే మా లక్ష్యం : తాలిబన్లు

ఇండియా తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని అదే మా లక్ష్యం అంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి జనిహుల్లా ముజిహిధ్ ప్రకటన చేశారు.
2. మెడర్నా వాక్సిన్ తో ఇద్దరు మృతి
మెడర్ణా వ్యాక్సిన్ వికటించి జపాన్ లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
3.భారత్ లో వాక్సినేషన్ .డబ్ల్యూహెచ్ఓ అభినందనలు

శుక్రవారం ఒక్కరోజు లోనే కోటి డోసులు వేసి భారత్ అరుదైన ఘనత సాధించింది.దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు తెలిపింది.
4.దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం
‘ వీధి అరుగు’ – నార్వే , దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం 2021 ‘ ను ఆగస్టు 28 29 రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.
5.వాహనదారులకు యూఏఈ హెచ్చరిక

యూఏఈ లో ఆదివారం నుంచి పాఠశాలలు తెరిచే పోతున్నాయి ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ పై దృష్టిసారించింది.ట్రాఫిక్ రద్దీ కారణంగా అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని , దీనిని నివారించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారు.
6.అమెరికాలో కరోనా టెర్రర్
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ ప్రభావం పెరుగుతోంది.రోజుకు లక్ష చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి.
7.తెలుగు ఎన్నారై రాధికకు ప్రతిష్టాత్మక అవార్డు

తెలుగు ఎన్నారై మహిళ రాధిక మంగినపూడి కి అరుదైన అవార్డు దక్కింది.తెలుగు భాషా దినోత్సవం 2021 సందర్భంగా రాధికకు ‘ తెలుగు ఎన్ఆర్ఐ అవార్డు కు ఎన్నికయ్యారు.
8.సింగపూర్ లో భారత సంతతి వ్యక్తి కి జైలు శిక్ష
సింగపూర్ లో చైనా సంతతికి చెందిన టాక్సీ డ్రైవర్ ను అసభ్య పదజాలంతో దూషించాడని తోపాటు, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను సహాయ నాదం ఆంటోనీ అనే భారత సంతతి వ్యక్తి కి మూడు రోజులు జైలు శిక్ష విధించారు.
9.వైట్ హౌస్ సాయం కోరిన సిక్కు సంఘాలు

ఆఫ్ఘన్ లోని గురుద్వారాలో వందలాది మంది హిందువులు , సిక్కులు చిక్కుకుపోయారని, వీరి తరలింపు విషయంలో సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని సిక్కు సంఘాలు వైట్ హౌస్ ప్రతినిధులను కోరారు.
10.దొంగతనం కేసులో భారత సంతతి వ్యక్తి కి జైలు
సింగపూర్ లో జెసిబి దొంగతనం చేసి దానిని విక్రయించేందుకు ప్రయత్నించిన భారత సంతతి వ్యక్తి కి సింగపూర్ కోర్టు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష విధించింది.
నంత కుమార్ లోకనాథన్ అనే భారత సంతతి వ్యక్తి జెసిబి దొంగతనం చేసి మలేషియా కు పారిపోయాడు.రెండు సంవత్సరాల తర్వాత అతను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా 3 ఏళ్ళ జైలు శిక్ష వివిధించారు.