1.గ్రీన్ లిస్ట్ దేశాల జాబితా సవరణ.
భారత్ కు దక్కని స్థానం
యూఏఈ రాజధాని అబుదాబి గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాను సవరించింది.ఈ జాబితాలో మొత్తం 55 దేశాలు ఉన్నాయి.కాకపోతే ఈ లిస్టులో భారత్ కు స్థానం దక్కలేదు.
2.కువైట్ ఎంతమంది ప్రవాసీయులను తొలగించింది అంటే
గడిచిన ఐదేళ్లలో సుమారు 400 23 మంది విదేశీ ఉద్యోగులను కువైట్ తొలగించింది.సివిల్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు 423 ప్రవాసీలు ఉద్యోగాలను తొలగించినట్లు పీ హెచ్ డబ్ల్యు పేర్కొంది.
3.అమెరికాలో తెలుగు వన భోజనాలు

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వార్షిక సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు జరిగాయి.40 ఏళ్లుగా అమెరికా రాజధాని వేదికగా నిర్వహిస్తున్నారు .
4.సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి

సౌదీ అరేబియా లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ‘ అభా ‘ విమానాశ్రయం పై సాయుధ డ్రోన్ దాడి జరిగింది.
5.అఫ్గాన్ లో హజరత్ మైనారిటీల ఉచ కోత
హజారా మైనారిటీ కమ్యూనిటీకి చెందిన 14 మందిని తాలిబన్ లు ఈరోజు కాల్చిచంపారు.
6.ఇండియతో ఏ విధమైన ముప్పు ఉండదు : తాలిబన్లు

ఇండియా పై సానుకూల వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు.భవిష్యత్తులోనూ ఇండియా తో తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, తాము నిత్య సంబంధాలు కోరుకుంటున్నామని తాలిబన్ల అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
7.శ్రీలంకలో ఆహార కొరత.ఎమర్జెన్సీ విధింపు
శ్రీలంకలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది.దీంతో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.
8.తాలిబన్లు సంబరాలు

రాజస్థాన్ లో అమెరికా చిట్టచివరి విమానం ఎగరడం తో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు.తుపాకులతో కాల్పులు జరుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
9.పాకిస్తాన్ లో శ్రీ కృష్ణుడి ఆలయం ధ్వంసం

పాకిస్థాన్ లోని సింథ్ లో శ్రీ కృష్ణుడి ఆలయం పై వందలాది మంది పాకిస్థానీయులు దాడిచేసి విగ్రహాలను ధ్వంసం చేశారు.
10.ప్రపంచానికి మరో వైరస్ ముప్పు
ప్రపంచానికి మరో కొత్త వైరస్ ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.ఈ కొత్త వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు రష్యా ప్రకటించింది.