1.అమెరికా లో ఎన్ ఆర్ ఐ ల నిరసన
కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో మరణించిన అమెరికా సైనికులకు సంఘీభావంగా అమెరికాలో ఎన్నారైలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
2.అమెరికాలో తెలుగు పాఠాలు

అమెరికాలో జార్జియా కు చెందిన నలుగురు యువతీ యువకులు కలిసి స్థాపించిన సంస్థ ‘టిటీ టూటర్ ‘ ( తెలుగు తమిళ ట్యూటర్ ) సభ్యులు సౌత్ పార్పైస్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులు సుహాస్ బొంకూర్, కృతిక కాశిరెడ్డి , రితికా వేములపల్లి, వినయ్ పోలాకు వీరు నలుగురూ కలిసి స్థానికంగా తెలుగు , తమిళం పాఠాలు నేర్పుతున్నారు.
3.వైఎస్ సేవలను గుర్తు చేసుకున్న ఎన్ ఆర్ ఐ లు
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు ఘనంగా ఆయన నివాళులు అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
4.ఇండియన్ అమెరికన్ కు మూడేళ్ల జైలు
వైర్ ఫ్రాడ్ , టాక్స్ ఎగవేత కేసులో శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన 52 సంవత్సరాల పృథ్వీరాజ్ ‘ రోజర్ ‘ బిఖాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
5.ఇండియా మాకు ముఖ్యమైన దేశం : తాలిబన్లు
ఇండియా మాకు ముఖ్యమైన దేశం అని, వారికి ఎలాంటి ముప్పు ఉండదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు.
6.ఇండియాలోని ఆఫ్ఘన్ మహిళ ఆవేదన

ఇండియాలో జీవిస్తున్న ఆఫ్ఘన్ మహిళ హిరాత్ తన జీవితం పై ఆవేదన తో ఉంది.తాను అఫ్గాన్ లకు కనిపిస్తే చంపేస్తారెమో అని ఆందోళన చెందుతోంది.
7.అమెరికాకు తలనొప్పిగా మారిన ఆ రెండు దేశాలు
ఆఫ్ఘన్ వ్యవహారం ముగియక ముందే అమెరికా కొత్త తలనొప్పులు మారాయి.ఉత్తర కొరియా ఇప్పుడు మళ్ళి అణు సమస్యలను తెచ్చి పెట్టెందుకు సిద్ధం అవడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆందోళనలో ఉన్నారు.
8.పారా ఒలంపిక్స్ లో భారత్ సత్తా

పారా ఒలంపిక్స్ లోనూ భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.సోమవారం ఒక్కరోజే నాలుగు పతకాలు సాధించారు.
9.అమెరికా పై తాలిబన్ల ఆగ్రహం
అమెరికాపై తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం ఓ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని డ్రోన్ సాయంతో అమెరికా బలగాలు షేర్ చేసిన విషయంపై అమెరికాపై తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా మజాహిధ్ మండిపడ్డారు.
10.కాబూల్ ఎయిర్ పోర్ట్ పై రాకెట్ దాడులు

కాపులు మరోసారి రాకెట్ దాడులు చోటు చేసుకున్నాయి.సోమవారం ఉదయం కాబూల్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వైపు 5 రాకెట్లు ప్రయోగించబడినట్లు విమానాశ్రయంలో ఉన్న డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ గుర్తించింది.