1.మెక్సికోలో భారీ భూకంపం
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది.దీని తీవ్రత 7.1 గా నమోదు అయిందని నేషనల్ సిస్మో లాజికల్ సర్వీస్ వెల్లడించింది.
2.అమెజాన్ అడవుల్లో రహస్య రన్ వే

అమెజాన్ అడవుల్లో రహస్య రన్ వే బయటపడింది.బ్రెజిల్ బొలివియా సరిహద్దుల్లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో ఓ రహస్య రన్ వే ను అధికారులు గుర్తించారు.
3.పౌరులకు అమెరికా హెచ్చరిక
కరుణ కేసులు తీవ్రంగా ఉన్న శ్రీలంక, జమైకా, బ్రూనై దేశాలకు ప్రయాణాలు చేయవద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది.
4.రెండేళ్ల చిన్నారులకు కరోనా టీకాలు

ప్రపంచంలోనే తొలిసారిగా రెండేళ్ల చిన్నారులకు కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు.
5. ఆఫ్ఘన్ లో కొత్త ప్రభుత్వం
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.తాలిబన్ల అధినేతగా ముల్లా మహ్మద్ హాసన్ అఖుంద్ పేరు ఖరారు అయ్యింది.
6.ఇండోనేషియా లో అగ్ని ప్రమాదం .40 మంది ఖైదీల మృతి

ఇండోనేషియా దేశంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.బుదవారం ఉదయం బాంటెన్ ప్రావీన్స్ జైలు లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో 40 మంది ఖైదీలు మృతి చెందారు.
7.సౌదీ అరేబియా లో రికార్డ్ స్థాయి ధర పలికిన డేగ

సౌదీ అరేబియాలో ఓ గ్రద్ద కు రికార్డ్ స్థాయిలో ధర పలికింది.సౌదీ అరేబియాలో ని మల్లం లో జరిగిన వేలంలో అమెరికాకు చెందిన తెల్లటి డేగ 11.80 కోట్లకు అమ్ముడుపోయింది.
8.చైనా పై బైడన్ సంచలన వ్యాఖ్యలు
తాలిబన్ల తో ఒప్పందం కోసం చైనా ప్రయత్నం చేస్తోంది అని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
9.అఫ్ఘాన్ పరిణామాలపై భారత్ తో రష్యా అమెరికా చర్చలు
అఫ్ఘాన్ లో చోటు చేసుకున్న పరిణామాలపై భారత్ తో రష్యా అమెరికా ఉన్నత స్థాయి చర్చలు జరిపింది.
10.ఆఫ్ఘన్ లో మహిళా క్రీడలు నిషేధం

ఆఫ్ఘనిస్తాన్ లో మహిళా క్రీడలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.క్రీడలు మహిళల శరీర భాగాలను బహిర్గతం చేస్తాయి అంటూ తాలిబన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.