వైర‌ల్ వీడియో.. సింహాన్నే భ‌య‌పెట్టిన జింక‌పిల్ల‌..

మ‌న‌కు సోష‌ల్ మీడియాలో క‌నిపించిన‌న్ని వింత‌లు మ‌రెక్క‌డా క‌నిపించ‌వ‌నే చెప్పాలి.ఇక ప‌దే ప‌దే కొన్ని ర‌కాల వీడియోల గురించి వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

 Viral Video Deer Calf Scared The Lion, Viral Video, Deer , Viral Animals Video,-TeluguStop.com

ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్ట‌దు.అందుకే నెటిజ‌న్లు ఇలాంటి త‌ర‌హా వీడియోల‌ను ఎక్కువ‌గా చూస్తూ ఉంటారు.

ఇక అవి ఏవా అనుకుంటున్నారా అదేనండి జంతువుల‌కు సంబంధించిన వీడియోలు.అడ‌విజంతువుల‌కు సంబంధించిన వీడియోల‌కు నెట్టింట బాగా ఆద‌ర‌ణ ఉంటుంది.

ఇక ఇందులో మ‌రీ ముఖ్యంగా క్రూర మృగాల‌కు సంబంధించిన వేటకే ఆద‌ర‌ణ ఎక్కువ‌.

అయితే ఇందులో సింహాల వేట ఎప్పుడూ ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి.

ఎందుకంటే వాటికి ఎద‌రు పడేందుకు ఏ జంతువులు కూడా సాహసించవు.ఎందుకంటే సింహం పంజా పవర్ కు ఎంత పెద్ద జంతువు అయినా స‌రే దానికి ఆహారం కావాల్సిందే.

అందుకే సింహాల‌ను అడ‌వికి రాజులు అని పిలుస్తారు.మ‌రి కొన్ని సార్లు అయితే ఎంతటి బలశాలి అయినా అవి కూడా ఓటమిని చూడాల్సిందే.

ఎందుకంటే ప్ర‌తిసారి సింహ‌మే గెలుస్తుంద‌ని చెప్పలేం.సంద‌ర్భాన్ని బ‌ట్టి చిన్ని చిన్న జంతువులు కూడా సింహాన్ని ప‌రిగెత్తిస్తాయి.

వ్యూహాన్ని అమలు చేయడంలో సింహం ఫెయిల్ అయితే మాత్రం చిన్న జంతువు కూడా దాని నుంచి తప్పించుకుని పారిపోతుంది.

ఇక ఇప్పుడు కూడా ఓ చిన్న జంతువు భ‌లే ఎస్కేప్ అయింది.ఇందులో ఓ జింక‌పిల్ల సరస్సు వ‌ద్ద‌కు వ‌చ్చి నీరు తాగి పిల్ల సేద తీరుతూ క‌నిపిస్తుంది.అయితే ఎక్క‌డి నుంచి క‌నిపెట్టిందో ఏమో గానీ అక్క‌డ‌కు అకస్మాత్తుగా ఓ సింహం వ‌చ్చి మెరుపు వేగంతో జింక‌పిల్ల‌పై దాడి చేస్తుంది.

అయితే సింహాన్ని ముందే గ్రహించిన జింకపిల్ల ఏమాత్రం భయపడకుండా త‌న తెలివితో మరో మార్గం వైపు వెళ్తున్న‌ట్టు న‌టించి న‌మ్మించ‌డంతో సింహం అటువైపు వెళ్తుంది.కానీ జింక‌పిల్ల ఇంత‌లో వ్యూహం మార్చి మ‌రోవైపు ప‌రుగులు పెడుతుంది.

దీంతో సింహం నుంచి తన ప్రాణాలను కాపాడుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube