అప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటించనని అన్నాడట... ఇప్పుడు చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు...

పలు టాలీవుడ్ చిత్రాలలో కామెడీ మరియు విలన్ పాత్రలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు “రాజా రవీంద్ర” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే రాజా రవీంద్ర కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరలో కూడా నటించి అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నాడు.

 Telugu Actor Naveen Chandra Bagged Huge Offer In Ram Charan And Shankar Movie, T-TeluguStop.com

కాగా తాజాగా రాజా రవీంద్ర ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ముఖ్యంగా రాజా రవీంద్ర ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ సెలబ్రెటీలైన జయసుధ, నిఖిల్ సిద్ధార్థ్, నవీన్ చంద్ర మరియు ఇతర హీరో, హీరోయిన్ల కి మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ క్రమంలో వారి యొక్క తదుపరి చిత్రాల డేట్లు మరియు రెమ్మ్యూనరేషన్ వంటి విషయాలను చూసుకుంటాడు.కాగా ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ మరియు టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “అరవింద సమేత” చిత్రంలో నవీన్ చంద్ర క్యారెక్టర్ కోసం తనని సంప్రదించగా మొదటగా నవీన్ చంద్ర ఆ పాత్రలో నటించనని చెట్లు ప్పినతెలిపాడు.

Telugu Naveen Chandra, Telugu, Telugunaveen, Trivikram-Movie

ఆ తర్వాత తాను కలుగజేసుకుని కచ్చితంగా నవీన్ చంద్ర అరవింద సమేత చిత్రంలో నటించాల్సిందేనని పట్టుబట్టడంతో నవీన్ చంద్ర ఒప్పుకున్నాడని చివరికి అరవింద సమేత చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అవ్వడంతో ప్రస్తుతం నవీన్ చంద్ర కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకొచ్చాడు.దీంతో ప్రస్తుతం నవీన్ చంద్ర రాత్రి, పగలు తేడా లేకుండా బిజీబిజీగా సినిమా షూటింగులతో గడుపుతున్నాడని కూడా తెలిపాడు.అయితే తాను మేనేజర్ గా వ్యవహరిస్తున్న సమయంలో కేవలం వారి యొక్క వృత్తి పరమైన విషయాలను మాత్రమే చూసుకుంటానని ఇతర విషయాలలో అస్సలు జోక్యం చేసుకోనని కూడా తెలిపాడు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పై స్పందిస్తూ తాను ప్రస్తుతం మా ప్యానెల్ లో సభ్యుడిని కాదని అందువల్ల తాను ఎన్నికలపై ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని తెలిపాడు.

అంతేకాకుండా ప్రస్తుతం తాను వ్యక్తిగత పనులలో బిజీ బిజీగా గడుపుతున్నానని అందువల్లనే మా ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube