టీడీపీ ఎలక్షన్ స్ట్రాటజీ.. షురూ ?

టీడీపీ ( TDP ) ప్రస్తుతం ఏపీపై ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో తెలంగాణపై కూడా అంతే స్థాయిలో ఫోకస్ పెట్టింది.గత ఎన్నికల టైమ్ లో తెలంగాణను లైట్ తీసుకున్న టీడీపీ ఈసారి మాత్రం ఇక్కడ ఎలాగైనా సత్తా చాటలని గట్టి పట్టుదలతో ఉంది.

 Tdp Started The Election Strategy Details, Tdp, Chandrababu Naidu, Kasani Gnanes-TeluguStop.com

అందుకు తగ్గట్టుగానే పార్టీని బలోపేతం చేసేందుకు టి టీడీపీ( Telangana TDP ) గట్టిగానే ప్రయత్నిస్తోంది.అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఇప్పటికే తెలంగాణ లక్ష్యంగా బహిరంగ సభలు, పార్టీ కార్యకర్తలతో మీటింగ్ లు వంటివి ఏర్పాటు చేస్తూ నేతల్లో జోష్ నింపుతున్నారు.

ఇక ఎన్నికలకు కేవలం ఐదు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఇకపై ఏ మాత్రం నిర్లక్షం చేయకుండా ప్రజల్లోకి వెళ్ళేందుకు టి టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

Telugu Chandrababu, Cm Kcr, Congress, Telangana, Telangana Tdp, Ttdp-Politics

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో టి టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బస్సు యాత్రకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారట.ఇక ఎప్పుడు యాత్ర ప్రారంభించాలి అనే దానిపై అధినేత చంద్రబాబు క్లారిటీ కోసం టి టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ బస్సు యాత్రకు చంద్రబాబు పాల్గొంటారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.అయితే కచ్చితంగా చంద్రబాబు అడపా దడపా యాత్రలో పాల్గొనే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.

Telugu Chandrababu, Cm Kcr, Congress, Telangana, Telangana Tdp, Ttdp-Politics

చంద్రబాబు సలహా మేరకు ఈ బస్సు యాత్రలోనే నియోజిక వర్గాల వారీగా అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar ) ఇటీవల చెప్పుకొచ్చారు.ఇక ఈ యాత్రలో ప్రధానంగా కే‌సి‌ఆర్ పాలన వైఫల్యాలను, కుటుంబ దోపిడిని హైలెట్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా టీడీపీ వ్యూహాలను రచిస్తోంది.కాగా ఈసారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది.ఈ త్రిముఖ పోరులో ఇప్పుడు ఎంతవరకు రాణిస్తుంది.? టీడీపీ ఎంట్రీ వల్ల ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.మరి టీడీపీ ఎఫెక్ట్ ఏ పార్టీలపై ఎక్కువగా పడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube