సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు.ఆ టాపిక్స్ గురించి ప్రశ్నలు అడిగినా సెలబ్రిటీలను ప్రశ్నలు అడిగే విధానం ఇదేనా అని కామెంట్లు వ్యక్తమవుతాయి.
అయితే లస్ట్ స్టోరీస్2( Lust Stories2 ) ఈ నెల 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కాజోల్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

మీ దృష్టిలో లస్ట్ అంటే ఏంటి అని ఒక విలేకరి కాజోల్( Bollywood Actress Kajol ) ను అడగగా ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.నా దృష్టిలో లస్ట్ అంటే విపరీతమైన కోరిక అని ఆమె అన్నారు.అది మనకు ఉండే శరీర వాంఛల్లో మాత్రమే కాదని ఏ విషయంలో అయినా కావచ్చని ఆమె కామెంట్లు చేశారు.నా వరకు అయితే నా లైఫే నాకు ఒక పెద్ద లస్ట్ అని కాజోల్ పేర్కొన్నారు.
నచ్చిన ఆహారం తినడం, డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ ఆస్వాదించడం కూడా నా దృష్టిలో లస్ట్( Lust Meaning ) అని ఆమె అన్నారు.
పిల్లలతో గడిపిన ప్రతి నిమిషాన్ని ఆస్వాదించడం కూడా నా దృష్టిలో లస్ట్ కిందికి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రముఖ నటీమణులు నటించిన లస్ట్ స్టోరీస్2 ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.లస్ట్ స్టోరీస్1 ను మించి లస్ట్ స్టోరీస్2 ఈ ఉండనుందని తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్ షూట్ సమయంలోనే తమన్నా విజయ్ వర్మ( Vijay Varma Tamannaah ) ప్రేమలో పడ్డారని సమాచారం అందుతోంది.

లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్లు సైతం భారీ రేంజ్ లో పెరిగే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నారు.బోల్డ్ వెబ్ సిరీస్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కమర్షియల్ రిజల్ట్ గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.







