టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రెస్ మీట్ పాయింట్లు(27-10-2022)‘‘జగన్ ప్రైవేటు సైన్యాధ్యక్షుడిలా సీఐడీ చీఫ్.’’సునీల్ కుమార్ మానసిక పరిస్థితి బాగోలేదు ఇతనిపై హైకోర్టు, హైదరాబాద్, విజయవాడలో కేసులు ధర్మపీఠం వంటి సీఐడీ చీఫ్ స్థానానికి సునీల్ అనర్హుడు అధికారపక్షం కళ్లల్లో ఆనందం కోసమే పనిచేస్తున్నారు జగన్, సజ్జల డైరెక్షన్ లో సీఐడీ చీఫ్ చట్టవ్యతిరేక చర్యలు కళంకిత అధికారులందరినీ కోర్టుబోనులో నిలబెడతాం.
సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ‘‘ముఖ్యమంత్రి జగన్ ప్రైవేటు సైన్యాధ్యక్షుడిలా పనిచేస్తున్నారు…తక్షణమే ఇతన్నీ ఆ పదవి నుండి ముఖ్యమంత్రి తొలగించాలి’’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.సీఐడీ అనేది ధర్మపీఠం వంటిదని, ఇది అందరికీ సమన్యాయం చేయాల్సిఉందని అభిప్రాయపడ్డారు.
సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఏకపక్ష ధోరణితో అధికార పార్టీ కళ్లల్లో ఆనందం నింపేందుకు పనిచేస్తున్నారని.ఇలాంటి వ్యక్తికి సీఐడీ చీఫ్ గా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….
‘‘సునీల్ మానసిక స్థితి బాగోలేదు’’:
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదు.కుటుంబ కలహాలతో కుడితో పడిన ఎలుక మాదిరి కొట్టుమిట్టాడుతున్నాడు.కుటుంబానికి దూరంగా ఏకాకిలా సునీల్ కుమార్ బ్రతుకుతున్నారు.ఇతని సతీమణి విజయవాడలో 498(ఏ)సెక్షన్ కింద కేసు పెట్టిందని తెలుస్తోంది.హైకోర్టులో సునీల్ కుమార్ పై అతని అత్తమామలు రిటి పిటిషన్ కేసు వేశారు.
హైదరాబాద్ లో సునీల్ కుమార్ పై డొమెస్టిక్ వయోలెన్స్ కేసు నమోదైంది.దీనిపై చార్జిషీటు కూడా పడింది.సునీల్ కుమార్ వేధింపులు వల్లే అతని బావ పీవీ రమేష్ సీఎం కార్యాలయం లో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
‘‘పోస్టింగులు ఇచ్చేముందు సీఎం ఆలోచించాలి’’
కళంకిత అధికారి సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ గా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించకుండా.తక్షణమే వేరే ప్రాధాన్యత లేని పదవిలో కూర్చోబెట్టడం రాష్ట్ర ప్రజలకు మేలు.ముఖ్యమంత్రి కూడా ఎవరికైనా పదవులు ఇచ్చే ముందు నాలుగు సార్లు వాళ్ల మానసిక స్థితి, వ్యక్తిగత విషయాలను తెలుసుకున్న తర్వాత పదవులు ఇస్తే బాగుంటుంది.రూల్ ఆఫ్ లా కు వ్యతిరేకంగా సునీల్ కుమార్ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు.
‘‘అధికారపక్షం కళ్లల్లో ఆనందం కోసమే సీఐడీ పనిచేస్తోంది’’
సీఐడీ కేవలం అధికారపక్షానికి ఊడిగం చేయడానికే అనేలా పనిచేస్తున్నారు.ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి దొంగతనంగా అరెస్టు చేయడం ఏ చట్టంలో ఉందో సునీల్ కుమార్ చెప్పాలి.సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా యూనిఫాం లేకుండా, బ్యాడ్జీలు లేకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ.
నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన వారి ఇల్లల్లో లైట్లు పగులకొట్టడం…ఆ ప్రాంతం అంతా చీకటిమయం చేయడం, గోడలు దూకడం, మహిళలు ఒంటరిగా ఉన్న గదుల్లోకి చొరబడడం ఏ చట్టంలో ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సమాధానం చెప్పాలి.ఏపీలో సీఐడీ చట్టపరిధి దాటి ప్రవర్తిస్తోంది.వీటికి నైతిక బాధ్యత వహిస్తూ సునీల్ కుమార్ తక్షణమే సీఐడీ చీఫ్ గా రాజీనామా చేయాలి.
‘‘ప్రతిపక్షంపై పక్షపాత వైఖరి చూపుతున్న సీఐడీ చీఫ్’’
ప్రతిపక్ష నాయకులను సోషల్ మీడియాలో అధికారపక్ష నాయకులు, కార్యకర్తలు అసభ్యకర పోస్టులతో వేధిస్తున్నారని…అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నేను ఎన్నిసార్లు వినతి వినతిపత్రాలు ఇచ్చినా సీఐడీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.పక్షపాతంగా వ్యవహరిస్తోంది.మేము ఇచ్చిన ప్రతి వినతిపత్రానికి సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్టు తప్పకుండా చట్టబద్దంగా రాబడతాం.
‘‘రొట్టెకు రెండు రొట్టెలు చట్టబద్దంగా వడ్డిస్తాం’’
సునీల్ కుమార్ పై ఢిల్లీలోని డీఓపీటీ(Department of Personel Training) ని కలిసి ఫిర్యాదు చేస్తాం.మానవహక్కులు, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా సీఐడీ పనిచేస్తోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్-19కు సీఐడీ ఏపీలో తూట్లు పొడుస్తోంది.దీనికి సీఐడీ అధికారులు అంతకంతకు రానున్నకాలంలో మూల్యం చెల్లించక తప్పదని గుర్తుపెట్టుకోవాలి.
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో సహా కళంకిత అధికారులందరిపై చట్టబద్దంగా న్యాయపోరాటం చేసి కోర్టు బోనులో నిలబెడతాం.రాజకీయ నాయకులు శాశ్వతం కాదనే విషయాన్ని సీఐడీ చీఫ్ గుర్తుపెట్టుకోవాలి.
రానున్న కాలంలో టీడీపీ అధికారంలోకి వస్తుంది…రొట్టెకు రెండు రొట్టెలు అదనంగా…చట్టబద్దంగా వడ్డిస్తాం.