టిడిపి, జనసేన ,బిజెపి పొత్తు( TDP Janasena BJP )లో భాగంగా సీట్లను పంచుకున్నాయి.బిజెపి ఆరు ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలను తీసుకోగా, జనసేన రెండు ఎంపీ , 21 అసెంబ్లీ స్థానాలను తీసుకుంది.
అయితే ఈ టిక్కెట్ల కేటాయింపు విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలు ఏర్పడుతున్నాయి.పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ లకు కేటాయించిన స్థానాల విషయంలో టిడిపి నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, అధినేతలపై ఒత్తిడి చేస్తుండగా, మిగతా రెండు పార్టీల్లో నూ అదే పరిస్థితి కనిపిస్తోంది.
తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని( Tirupati Assembly Seat ) పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో, తిరుపతి టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జనసేన నుంచి ఆరాని శ్రీనివాసులకు( Arani Srinivasulu ) టికెట్ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు.టిక్కెట్ దక్కకపోవడంపై మీడియా సమావేశాన్ని నిర్వహించి తనకు జరిగిన అన్యాయంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి( TDP ) కోసం తాము ఎంతగానో పనిచేశామని , తిరుపతి అసెంబ్లీ స్థానం తనకు దక్కకపోవడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.
పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించడంపై పార్టీ పునరాలోచించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా చంద్రబాబు( Chandrababu )కు అనేక ప్రశ్నలు వేశారు.సీటు విషయంలో చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయి అని ఆమె ప్రశ్నించారు.ఎవరికో మద్దతు పలకమంటే తాను అంగీకరించినా, పార్టీ క్యాడర్ అంగీకరించదు అని ఆమె పేర్కొన్నారు.
తిరుపతి టికెట్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్( Chandrababu Pawan Kalyan ) మరోసారి చర్చించాలని సుగుణమ్మ( Sugunamma ) కోరారు.తిరుపతి అభ్యర్థి పై పునరాలోచిస్తారని నమ్ముతున్నానని ,టిడిపి, జనసేన ప్రధాన నేతలు తిరుపతి అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని ఆమె సూచించారు.ఉన్న పళంగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తే తాము అంగీకరించినా, జనం అంగీకరించే పరిస్థితి లేదన్నారు.తనకు టికెట్ దక్కకపోయినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.