టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )తర్వాత సంఘీభావ దీక్షల పేరుతో కేవలం నిరసనలకే పరిమితమైన తెలుగుదేశం ఇప్పుడు ఎన్నికలకౌంట్ డౌన్ ను స్టార్ట్ చేసింది.ఎన్నికలకు ముందు ఆరు నెలల సమయం ఏ పార్టీకైనా అత్యంత విలువైనది అలాంటి సమయాన్ని ఏ కారణాల తోనూ వృధా చేయకూడదన్న చంద్రబాబు సూచనలతోనే ఇప్పుడు పార్టీ పూర్తి స్తాయిలో యాక్టివేట్ అవ్వడానికి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది .
ఈనెల 21వ తారీఖున పార్టీ విస్తృత స్థాయి సమావేశం లోకేష్ ( Nara lokesh )అధ్యక్షతన జరగబోతున్నట్లుగా ఆ పార్టీ ప్రకటించింది.ఇప్పటివరకు తెలుగు దేశానికి సంబంధించిన ఏ కీలక నిర్ణయమైనా చంద్రబాబు అధ్యక్షతన మాత్రమే జరిగేది.
అయితే అనివార్య కారణాలతో చంద్రబాబు జైలు జీవితం గడుపుతూ ఉండడంతో మొదటిసారి లోకేష్ కి లీడ్ చేసే అవకాశం దక్కింది.
అయితే తెలుగుదేశంలో చంద్రబాబు సమకాలికలైన చాలామంది సీనియర్లు తో లోకేష్ కి అంత సమన్వయం లేదు అని చెబుతారు.వారు చంద్రబాబు ఆర్డర్లను మాత్రమే ఫైనల్ గా భావిస్తారని ఇంకా ఎవ్వరిని ఖాతరు చేయరు అని లోకేష్ పాదయాత్ర లలో కూడా ఆయా నేతలు పాల్గొనలేదని , మరి ఇప్పుడు అలాంటి సీనియర్లందరినీ లోకేష్ ఏ మేరకు సమన్వయం చేసుకుంటారన్నదే ప్రశ్నగా మారింది.
అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ముందు చాలా టాస్కులు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లోకి ఇప్పటివరకు సానుభూతి అస్త్రాన్నే ప్రచారం చేస్తున్న టిడిపి( TDP ) ఇప్పుడు రాష్ట్రస్థాయి పాదయాత్రలకు సిద్ధమవుతుంది వాటిలో ఏ అంశాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాలి అన్నది చర్చించడానికి ఈ మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా జనసేనతో రాజకీయ ప్రయాణంపై అంచనాలు ఊహగానాలే తప్ప ఇప్పటివరకు వాస్తవ లెక్కలు బయటకు రాలేదు.ఈ రెండు పార్టీల బలాబలాలు, సీట్ల సర్దుబాటు వంటివి ఇంకా మొదలు కాలేదు .అందువల్ల ఇకపై పూర్తిస్థాయి క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాలని రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను రూపొందించడం కోసమే ఈ మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.తొందరలోనే జనసేన తెలుగుదేశం పొత్తుకు ప్రధాన అడ్డంకి గా ఉన్న సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుందని కూడా ఆ పార్టీ నాయకులు వాఖ్యనిస్తున్నారు .