మళ్లీ మొదలు : 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ' 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్ లో ఉన్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం,( TDP ) మళ్లీ ఏపీ అధికార పార్టీ వైసీపీ ( YCP ) ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం ఎత్తేందుకు సిద్ధమవుతోంది.ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

 Tdp Chief Chandrababu Naidu To Restart Idem Karma Mana Rashtraniki Campaign Deta-TeluguStop.com

నియోజకవర్గ ఇన్చార్జిలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు అనేక సూచనలు చేశారు.ముఖ్యంగా గతంలో నిర్వహించి ప్రజల ఆదరణ పొందిన ‘ ఇదేం కర్మ మన రాష్ట్రానికి ‘ కార్యక్రమాన్ని మళ్లీ వేగవంతం చేయాలని బాబు సూచించారు.

దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని, అన్ని నియోజకవర్గాలలోను ఏప్రిల్ చివరి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు.ఏప్రిల్ మొదటి వారంలో మూడు జోనల్ సమావేశాలను పూర్తి చేసి తాను కూడా పలు జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతానని చంద్రబాబు తెలిపారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Idemkarma, Jagan, Kia Company, Lokesh, Tdp

తాజాగా క్లస్టర్ నియోజకవర్గం ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అనేక సూచనలు చేశారు.ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు చేసి మంచి ప్రజాప్రతినిధులుగా పేరు తెచ్చుకోవాలని,  కొత్తగా ఎన్నికైన టిడిపి ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడుతూ.వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టిడిపి పై ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Idemkarma, Jagan, Kia Company, Lokesh, Tdp

ఈ సందర్భంగా వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు .వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కియా మోటార్స్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు.అప్పుడు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సమాధానం ఇవ్వగలవా జగన్ అంటూ బాబు ప్రశ్నించారు .వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా   జగన్ చేసిన వ్యాఖ్యలను,  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం కార్యక్రమంలో వాటిని ప్రస్తావించిన వీడియో క్లిప్ లను బాబు విడుదల చేశారు .అప్పటి జగన్ వ్యాఖ్యలు తాజాగా లోకేష్ సెల్ఫీ చాలెంజ్ లను ప్రస్తావిస్తూ వీడియోలతో చంద్రబాబు ట్విట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube