ఎన్నికలకు ముందే టోకెన్లు ! టిడిపి నయా స్కెచ్ ??

ఎన్నికలలో గెలవడానికి రకరకాల హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీలకు షరా మామూలే .అయితే గెలిచిన తర్వాత ఇచ్చిన హామీల లో మెజారిటీ హామీలను గాలికి వదిలేస్తారు.

 Tdp Ammaku Vandanam Token Hot Debate Details, Tdp, Ammaku Vandanam Scheme, Chand-TeluguStop.com

అన్ని హామీలను అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తారు.అయితే క్రమేనా రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు ప్రతి హామీని అనుమానంతో చూడటం మొదలుపెట్టారు.

ఇప్పుడు ప్రజలను నమ్మించడం రాజకీయ పార్టీలకు సవాల్ గా మారింది.ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా తర్వాత పట్టించుకోరు అన్న వాతావరణం బలపడడంతో ఇప్పుడువోటర్ ను ఆ కట్టుకోవడానికి రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడలకు తెర తీస్తున్నాయి .

Telugu Ammakuvandanam, Chandrababu, Cmjagan, Tdp Mahanadu, Tdp Manifesto, Tdp Sc

మహానాడు( Mahanadu ) వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ( TDP ) అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది.అయితే ప్రజలలో వాటి విశ్వసనీయత పై అనుమానంతో ఎన్నికలకు ముందే వాటి లబ్ది దారులను ఎంపిక చేసి టోకెన్లు పంచడం అనే ప్రక్రియ కు తెర తీసి సరికొత్త చర్చకు దారి తీసింది.అమ్మకు వందనం( Ammaku Vandanam ) పేరుతో తాము ప్రకటించిన సంక్షేమ పథకం తాలూకు అర్హులందరికీ ముందుగానే టోకెన్లు పంపిణీ చేస్తామని, అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామంటూ తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు, జగన్ ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ తామేమి పెట్టమని ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని ప్రజలకి నమ్మకం కలిగించేందుకే ముందుగా టోకెన్లు ఇస్తున్నామని నేతలు చెప్పుకుంటున్నారు.

Telugu Ammakuvandanam, Chandrababu, Cmjagan, Tdp Mahanadu, Tdp Manifesto, Tdp Sc

అయితే తెలుగుదేశం ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినప్పటికీ కేవలం అమ్మకు వందనం పథకానికి మాత్రమే ఎందుకు టోకెన్లు ఇస్తున్నారని? మిగిలిన రైతుబంధు గాని మిగిలిన సంక్షేమ పథకాలకు కూడా టోకెన్లు ఇవ్వాలి కదా అంటూ వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.ఏది ఏమైనా అలవి గాని హామీలు ఇచ్చి ప్రజా నమ్మకం పోగొట్టుకుంటున్న పార్టీలకు ఈరోజు తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తామని నమ్మించడం చాలా కష్టమైపోయింది అని చెప్పవచ్చు .ఈ పరిస్థితి మాత్రం రాజకీయ నాయకుల స్వయంకృత అపరాధం కిందే చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube