ఒడిశా రైలు ప్రమాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది.
ఈ మేరకు న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేయనున్న విశాల్ తివారీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
కవచ్ ప్రొటెక్షన్ సిస్టంతో పాటు ఆటోమేటిక్ రైల్ ప్రొటెక్షన్ వ్యవస్థ అమలుపై కేంద్రానికి మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.