త్రీడీ కళ్లద్దాలు గురించి అందరికీ తెలుసు కదా.బయట పెద్దగా వాడకపోయినా ఏదోఒక త్రీడీ సినిమాను మీరు ఆ గ్లాసెస్ పెట్టుకొని చూసే వుంటారు.
వాటిని పెట్టుకోవడం ద్వారా త్రీడీ అనుభూతిని పొందుతూ వుంటారు.అయితే సరిగ్గా అలాంటి గ్లాసెస్ ను పోలి ఉండే స్మార్ట్ గ్లాసెస్ ను సరికొత్తగా TCL మార్కుట్లోకి తీసుకు వచ్చింది.
ఇది సాధారణ గ్లాస్ కాదు.అలాగని త్రీడీ గ్లాసెస్ కూడా కాదు.
అంతకుమించి అనేట్లు దీని ఫీచర్లు వున్నాయి.
దీనిని ఇటీవల లాస్ వేగాస్ లోని కస్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్)లో రేనియో ఎక్స్2(TCL RayNeo X2) పేరిట TCL ప్రదర్శించింది.
TCL అనేది చైనాకు చెందిన టీవీల తయారీ కంపెనీ అని మీకు తెలుసు కదా.ఈ రేనియో ఎక్స్2 అద్దాలను రోజువారీ మీరు వాడే కళ్లద్దాల మాదిరిగానే వాడుకోవచ్చట.
దీనిలో అత్యాధునిక సాంకేతికత ద్వారా మీకు అవసరమైన జీవీస్ నావిగేషన్, ఆటో ట్రాన్స్ లేషన్, ఫోన్ కాల్స్, మెసేజ్లను ఫోన్ నుంచి కాకుండా నేరుగా ఈ కళ్లద్దాల నుంచి చూడొచ్చు.దీనిలో మైక్రో LED డిస్ ప్లే మీ కళ్ల ముందు వాటిని ప్రొజెక్ట్ చేస్తుంది.అలాగే ఈ స్క్రీన్ పైనే వీడియోలు కూడా చూడొచ్చు, పాటలూ వినొచ్చు.ఈ కళ్లజోడు పెట్టుకుంటే ఇక ఫోన్ తో పని ఉండదు.అలాగే ఇందులో ఉన్న మరో ఫీచర్ ఆటో ట్రాన్స్ లేషన్.
అంటే మనకు రాని వేరే భాషను మాట్లాడుతున్న వ్యక్తితో మనం సంభాషించాల్సి వచ్చినపుడు ఇది అప్పటికప్పుడు అది ఆ వ్యక్తి మాటలను ట్రాన్స్ లేట్ చేసి స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేస్తుందన్నమాట.TCL రేనియో ప్రపంచలోనే మొట్టమొదటి బైనాక్యూలర్ ఫుల్ కలర్ మైక్రో LED ఆప్టికల్ AR కలిగిన స్మార్ట్ గ్లాసెస్ అని ఆ సంస్థ ECO హౌయి లీ చెప్పారు.ఇది సైలిష్ గా ఉండటం మాత్రమే కాదు, యూజర్ ఫ్రెండ్లీ కూడా.ఇది కళ్లకు పెట్టుకునే మరిన్ని కొత్త ఇన్ వెన్షన్లకు నాంది పలుకుతుందన్నారు.’
.