అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంస్థ (తానా) గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.భారతదేశం లో నిర్వహించే ప్రతీ పండుగని, విశిష్టమైన పర్వదినాలని ఎంతో ప్రత్యేకంగా జరుపుతుంది.
ఎక్కడా కూడా భారతీయ సాంప్రదాయలకి తక్కువ చేయకుండా ఘనంగా ప్రతీ కార్యక్రమ నిర్వహణ చేపట్టడంలో తానా ప్రత్యేక దృష్టి పెడుతుంది.సంక్రాంతి పండుగ పురస్కరించుకుని అమెరికాలో తానా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇదిలాఉంటే తాజాగా
తానా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది.మార్చి 7 వ తేదీన ఫిలడెల్ఫియా లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తోంది.
స్థానికంగా ఉన్న ఓ స్కూలు లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.ఈ వేడుకలని తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ దేవినేని, ఉమెన్స్ కో ఆర్డినేటర్ , సరోజా పావులూరి దగ్గరుండిమరీ ఈ వేడుకలకి సంభందించిన ఏర్పాట్లు చూసుకున్నారు.
తానా తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన దల్చిన వారు కుటుంభానికి 10 డాలర్లు , సింగిల్ గా పాల్గొనాలి అంటే సుమారు అంటే 5 డాలర్లు చెల్లించాలని రుసుములు విధించింది.సరోజ పావులూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంతో మంది తెలుగు మహిళలు ఈ వేడుకలకి భారీగా తరలి రానున్నారని తానా ఓ ప్రకటనలో తెలిపింది.