అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.తెలుగు బాషాభివ్రుద్ది, సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించడంలో వాటిని అమెరికాలో సైతం మన భవిష్యత్తు తరాలవారికి తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించడంలో తానా ఎంతో కృషి చేస్తోంది.
అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు అన్నిటికంటే, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నిటికంటే కూడా తానాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.కేవలం అమెరికాలో ఉన్న తెలుగు వారి సంక్షేమమే కాదు, తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవా, చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.
కరోనా సమయంలో తానా ఎన్నో సేవా, సహాయ కార్యక్రమాలు చేపట్టింది.ఈ క్రమంలోనే తానా కరోనా నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ సాయం అందించనుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో తాము ఎంపిక చేసిన ఆసుపత్రులకు వైద్య పరికరాలు, పలు రకాల అత్యవసర వైద్య సదుపాయాలను సమకూర్చేందుకు దాదాపు రూ.25 కోట్లు విరాళం అందించనున్నట్టుగా ప్రకటించింది.ఈ విషయాన్ని తానా ఫౌండేషన్ చైర్మెన్ గా ఎన్నికయిన యార్లగడ్డ వెంకట రమణ తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలలో తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని, కొన్ని గ్రామాలలో పాటశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టామని ఆయన తెలిపారు.
విద్యా, వైద్య వంటి కీలకమైన సేవలలో తానా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు…ఇదిలాఉంటే
అమెరికాలోని నార్త్ వెస్టర్న్ మెడిసిన్ ప్రాజెక్ట్, సహకారంతో తాము ఈ పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నామని అత్యంత అధునాతనమైన పరికరాలు అందిస్తామని, వీటిని కార్గో షిప్మెంట్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు తరలిస్తామని, రెండు నెలలలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.ఈ పరికారాలను తాము ఇప్పటికే ఎంపిక చేసిన ఆస్పత్రులకు తరలిస్తామని ప్రకటించారు.
తానా రెండు తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.