పాద‌యాత్ర‌ల విష‌యంలో వెన‌క‌బ‌డ్డ కాంగ్రెస్‌.. దూసుకుపోతున్న బీజేపీ

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత క్రేజ్ ఈ పాద‌యాత్ర‌ల‌కు మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంద‌నే చెప్పాలి.

ఎందుకంటే ఈ పాద‌యాత్ర‌ల ఎఫెక్ట్ మామూలుగా ఉండ‌దు.

గ‌తంలో ఎంద‌రో గొప్ప నాయ‌కులు అంద‌రూ కూడా ఈ పాద‌యాత్ర‌ల‌తోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు.అంతెందుకు మొన్న‌టికి మొన్న జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర‌తో ఏకంగా భారీ మెజార్టీతో సీఎం అయ్యారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇంకోవైపు ఇప్పుడు తెలంగాణ‌లో కూడా ఇప్పు దీని క్రేజ్‌ను వాడుకునేందుకు అన్ని పార్టీల రెడీ అవుతున్నాయి.ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా స‌రే గద్దె దించేందుకు అన్ని పార్టీలు పాద‌యాత్ర‌ల అస్త్రాన్ని ఎత్తుకుంటున్నాయి.

అయితే అంద‌రిక కంటే ముందుగానే కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తామనే ప్రకటించినా కూడా ఇంకా స్టార్ట్ చేయ‌లేదు.కానీ బీజేపీ నేతలు మాత్రం అ అవ‌కాశాన్ని బాగానే యూస్ చేసుకుని పాదయాత్ర ప్రారంభించి దూసుకుపోతున్నారు.

Advertisement

కానీ కాంగ్రెస్ లో మాత్రం అలా లేదు.ఇంకోవైపు బీఏస్పీ నేత అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా త‌న పాదయాత్రతో క్రేజ్ పెంచుకునేందుకు రెడీ అవుతున్నారు.

అయితే పాద‌యాత్ర‌ల విష‌యంలో కీలక ప్రకటన చేసిన రేవంత్ మాత్రం ఎప్పుడు చేస్తాననేది క్లియ‌ర్ గా చెప్పలేదు.ఇంకోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉండ‌టంతో పాదయాత్ర ఆగిపోయింని చెప్తున్నారు.ఇక రేవంత్ త‌ర్వాత కీల‌క‌నేత అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీతో సంబంధం లేకుండానే భువనగిరి నుంచి తాను పాదయాత్ర చేస్తున్న‌ట్టు అప్పుడే ప్ర‌క‌టించారు.

కానీ అది ముంద‌ట ప‌డ‌లేదు.మ‌రో నేత అయిన జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తానంటూ చెప్పినా ఇంకా అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు.ఇలా ఎవ‌రికి వారే చెప్తున్నారు త‌ప్ప ముందుకు రావ‌ట్లేదు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు