ప్రస్తుత కాలంలో కొందరు కామ అంధకారంలో మునిగిపోయి తన మన అనే తేడా లేకుండా తమ సొంత తోడబుట్టిన వారిపైనే అత్యాచార అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.తాజాగా ఓ మైనర్ యువకుడు కామంతో కళ్ళు మూసుకుపోయి తన సొంత చెల్లెలిపైనే అత్యాచారం చేసి ఆమెను గర్భవతి చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే తమిళనాడులోని వేలూరు ప్రాంతంలో 16 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.అయితే ఈ బాలిక తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు.
అయితే ఈ బాలిక అన్న అయినటువంటి యువకుడికి కొంతమేర కామ వాంఛలు ఎక్కువగా ఉండేవి.దీంతో పని నిమిత్తం తల్లిదండ్రులు బయటకు వెళ్ళగా ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి తన చెల్లెలి పైనే అత్యాచారం చేశాడు.
అంతేగాక ఈ విషయం ఎవరికైనా చెబితే తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరించడం మొదలుపెట్టాడు.దీంతో బాలిక ఎవరికీ చెప్పకుండా మెదలకుండా ఉండిపోయింది.అయితే దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి ఆ యువకుడు పలుమార్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వుండేవాడు./br>
![Telugu Brother Sister, Brother, Tamil Nadu-Telugu Crime News(క్రైమ్ Telugu Brother Sister, Brother, Tamil Nadu-Telugu Crime News(క్రైమ్](https://telugustop.com/wp-content/uploads/2020/02/own-brother-harassed-by-her-sister-in-tamil-nadu.jpg)
అయితే గత కొద్ది రోజులుగా బాలికకి నెలసరి క్రమం సరిగా కాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తల్లి బాలికను దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడి దగ్గరికి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళింది.దీంతో వైద్యుడు బాలిక ప్రస్తుతం గర్భవతి అని చెప్పడంతో ఆమె తల్లి ఒక్కసారిగా విస్తుపోయింది.అయితే తను గర్భం దాల్చడానికి కారణం ఎవరని నిలదీయగా బాలిక తన అన్న పేరు చెప్పింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి యువకుడు చేస్తున్నటువంటి అఘాయిత్యం పై అతనిపై ఫిర్యాదు నమోదు చేశారు.దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.