కరోనా వచ్చిన తర్వాత ఎక్కువగా ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే ఎంతోమంది చిన్న సెలబ్రిటీలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ విధంగా వెబ్ సిరీస్ లకు వస్తున్న ఆదరణ చూసి స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోలు వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి కనబరిచగా అక్కినేని హీరో సుశాంత్ సైతం వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సుశాంత్ హీరోగా నటించిన కరెంట్, అడ్డా, చి ల సౌ, అలా వైకుంఠపురం వంటి పలు సినిమాలలో నటించారు.ఇలా పలు చిత్రాల్లో నటించిన ఆయన వెండితెరపై పెద్దగా అవకాశాలను అందుకోలేక పోతున్నారు.
ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యారు.సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ టైటిల్ ఫిక్స్ చేశారు.జీ 5 సోషల్ మీడియా ప్రొఫైల్ లో ఈ సిరీస్ కి ‘ఇది మా నీళ్ల ట్యాంక్‘ అనే క్రేజీ టైటిల్‌ను లాక్ చేసినట్లు వెల్లడించారు.
ఇక ఈ వెబ్ సిరీస్ లో సుశాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయగా,ప్రియా ఆనంద్, లావణ్య రెడ్డి, నిరోషా రథా, దివి వడ్త్యా, వాసు తదితరులు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు.ఇక ఈ వెబ్ సిరీస్ ని జీ 5 కోసం కొల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రవీణ్ కొల్లా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.