ఆ టాప్-5 జాబితాలో చోటు దక్కించుకున్న సూర్య కుమార్ యాదవ్..!

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.దీంతో ఆ టాప్-5 ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.

 Surya Kumar Yadav Record With 1841 Runs In His First 50 T20 Innings Details, Sur-TeluguStop.com

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.అంతేకాదు ఈ టాప్-5 ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు ఆటగాళ్లు మన భారతీయులే.

వెస్టిండీస్- భారత్ 5వ టీ20 మ్యాచ్ లో( India vs WI ) సూర్య కుమార్ యాదవ్ 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్ లతో 61 పరుగులు చేశాడు.దీంతో టీ20 క్రికెట్ లో తొలి 50 ఇన్నింగ్స్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.

ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ ఆ తర్వాత బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఉన్నారు.

విరాట్ కోహ్లీ:

అంతర్జాతీయ క్రికెట్లో రన్ లీడర్ గా విరాట్ కోహ్లీకి( Virat Kohli ) ప్రత్యేక స్థానం ఉంది.విరాట్ కోహ్లీ తొలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో మొత్తం 1943 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

బాబర్ ఆజం:

పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం( Babar Azam ) తోలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో 1942 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

మహమ్మద్ రిజ్వాన్:

పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ అయినా మహమ్మద్ రిజ్వాన్( Mohammad Rizwan ) తొలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో 1888 పరుగులు చేసి ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.

సూర్య కుమార్ యాదవ్:

భారత జట్టు బ్యాటర్ అయిన సూర్య కుమార్ యాదవ్ తొలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో 1841 పరుగులు చేసి తాజాగా ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు.

కేఎల్ రాహుల్:

భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్( KL Rahul ) తొలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో 1751 పరుగులతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube