టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.హైదరాబాద్ అల్వాల్ లోని గద్దర్ నివాసానికి వెళ్లిన ఆయన గద్దర్ మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు అనేక ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువలేనిదని చంద్రబాబు అన్నారు.గద్దర్ ను చూస్తేనే ప్రజా యుద్ధ నౌక గుర్తుకు వస్తుందన్నారు.
దేనికీ భయపడని వ్యక్తి గద్దర్ అన్న చంద్రబాబు ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని వ్యాఖ్యానించారు.తెలుగు జాతి మంచి ఉద్యమకారుడుగానే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు పని చేసిన వ్యక్తిగా గద్దర్ పేరు భావితరాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.