సురేఖ వాణి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న నటి సురేఖ వాణి.
పాత్ర ఏదైనా చక్కగా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సురేఖ వాణి ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్ లతో కలిసి నటించి కడుపుబ్బా నవ్వించింది.
అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలిచే వారిలో ఈమె పేరు కూడా ఉంటుంది.
అలా సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.తన కూతురుతో కలిసి చిందులు వేస్తూ, అందాలను ఆరబోస్తూ, నాలుగు పదుల వయసులో కూడా హాట్ ఫొటో షూట్ లను చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటుంది.
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు సురేఖ వాణి కూతురు కంటే సురేఖ అందంగా కనపడుతోందని కామెంట్లు చేస్తుంటారు.కరోనా సమయం నుంచి సురేఖ వాణి సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
తన కూతురితో కలిసి నాలుగు పదుల వయసులో కూడా చిందులు వేస్తూ, ఫొటోలకు హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ ఇంత క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా సురేఖవాణి షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.సురేఖ వాణి షేర్ చేసిన ఫొటో ఏంటంటే.
చేతిలో రెడ్ వైన్ గ్లాస్ తో ఉన్న ఫొటోని షేర్ చేసింది.ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో రెచ్చిపోతూ కామెంట్లు చేస్తున్నారు.
ఒక నెటిజన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని కామెంట్ చేయగా.మరొక నెటిజన్ మీరు బీరు తాగకండి బొజ్జ వచ్చేస్తుంది అంటూ సలహా ఇచ్చాడు.
అయితే అందంగా ఉన్నావు అంటూ కామెంట్ చేశారు.ఇలా నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.