ఎలాగైనా నటుడు కావాలని సినిమా పరిశ్రమకు వచ్చి మొదటగా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత అడపాదడపా హీరో అవకాశాలు దక్కించుకుంటూ తన నటనా ప్రతిభను నిరూపించుకుని సినిమా పరిశ్రమలో స్టార్ డం సంపాదించుకున్న ప్రముఖ కమెడియన్ మరియు హీరో “సునీల్” గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సునీల్ సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం బాగానే ఎదురు చూశాడు.
ఈ క్రమంలో ఒకానొక సమయంలో అవకాశాలు రాక పోవడంతో సినిమా పరిశ్రమ ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నప్పటికీ నటన పై ఉన్నటువంటి ఆసక్తి చావకపోవడంతో ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన “నువ్వే కావాలి” అనే చిత్రంలో కనిపించాడు.కానీ ఈ చిత్రంలో నటించడానికంటే ముందు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అనే చిత్రంలో లో రెండు లేదా మూడు సన్నివేశాలలో కనిపించానని అలాగే ఈ చిత్రంలో తన పాత్ర కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్ర తరహాలో ఉంటుందని కూడా ఆ మధ్య ఇంటర్వ్యూలో సునీల్ చెప్పుకొచ్చాడు.
కానీ తను నటించిన సన్నివేశాలు ఎడిటింగ్ లో తీసేశారని కూడా తెలిపాడు.అయితే అప్పట్లో సునీల్ ఈ చిత్ర షూటింగులో పాల్గొంటున్న సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో కొందరు సునీల్ అభిమానులు ఫన్నీగా సునీల్ అప్పట్లో ఎలా ఉండేవాడో మీరే చూడండంటూ ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో సునీల్ తాను నటించే చిత్రాలలోని పాత్రల విషయంలో రూటు మార్చాడు.
సినిమా పరిశ్రమలో హీరోగా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఇప్పుడు విలన్ గా కూడా నటించి తన నటనా ప్రతిభ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.ఆ మధ్య టాలీవుడ్ మాస్ మహారాజా రవి తేజ హీరోగా నటించిన “డిస్కో రాజా” చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసాడు.
ఇటీవలే నటుడు సుహాస్ హీరోగా నటించిన “కలర్ ఫోటో” చిత్రంలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కనిపించి ఎంతగానో అలరించాడు.దీంతో పాత్ర ఏదైనా సరే సునీల్ తనదైన శైలిలో ఆకట్టుకోవడంలో మంచి దిట్టని ఇప్పటికే కొందరు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కితాబిచ్చారు.