మనుషులు బలవంతులని విర్రవీగడం తెలిసిందే.ఇదంతా శరీర బలుపుని చూసుకుని ఎగరడం.
ఒక మనిషి దగ్గర కావలసినంత ధనం, బలగం ఉన్నా, అంతరిక్షంలో అద్దల మేడలు కట్టుకుని నివసించే తెలివి తేటలున్నా ఇవన్ని మానసిక బలం లేకపోతే వ్యర్ధమే.కాగా దాదాపుగా ప్రతి వ్యక్తికి తన కుటుంబమే బలం.కానీ ఆ కుటుంబం వల్లే బలవన్మరనానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఆ వివరాలు చూస్తే బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా పొగయనట్టి గ్రామానికి చెందిన కాడప్ప(48) భార్య గుండెపోటుతో మరణించడంతో ఆమె ఎడబాటును తట్టుకోలేక కాడప్ప ఇతని ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య చేసుకోవడం విషాదం.
వీరు ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని బలవంతంగా ప్రాణాలు వదిలారట.కేవలం దూరమైన బంధం కోసం పెళ్ళీడు కొచ్చిన ఇద్దరు కూతుళ్లకు ధైర్యం చెప్పవలసిన ఆ తండ్రి మానసిక కుంగుబాటుతో తనతో పాటుగా తన కూతుళ్ల ప్రాణాలు కూడా పోవడానికి కారణం అవడం విషాదకరం.