ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్నాడు.
డైరెక్టర్ త్రివిక్రమ్.ఎన్టీఆర్ తో ఓ సినిమా ఫిక్స్ చేయగా.దానికి ‘అయినను పోయిరావలె హస్తినకు‘ అని టైటిల్ ను కూడా పెట్టేశారు.అంతేకాకుండా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో కూడా ఓ సినిమా ఉందన్నట్లు తెలుస్తుంది.
ఇదే కాకుండా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.కొరటాల కాంబినేషన్ లో కూడా మరో సినిమా చేయనున్నాడు.
ఇదంతా ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉండగా.ఆగిపోయిందని తెలిసింది.
అంతేకాకుండా త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు తెలియగా, ఎన్టీఆర్ కొరటాలతో తో చేయనున్నట్లు తెలిసింది.దీంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి.
కానీ తాజాగా వీరి కాంబినేషన్ లో సినిమా ఆగిపోలేదని ప్రస్తుతం ఈ సినిమాకు కొంచెం గ్యాప్ ఇచ్చారని తెలుస్తుంది.

ఇక ఎన్టీఆర్ కొరటాల, ప్రశాంత్ నీల్ దర్శకత్వం తెరకెక్కనున్న సినిమాలు పూర్తి చేశాక త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఆగిపోలేదని.కానీ కాస్త సమయం పడుతుందని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాలో బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి డేట్స్ కుదుర్చుకోవడం తో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది.