ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అడ్దంకులు ఎదురవుతాయన్న విషయం తెలిసిందే.పదిమందికి ఉపయోగపడేది ఏదైనా సరే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే గానీ ప్రజల్లోకి చేరదు.
ఇక రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రంలో ఈ అంశాన్ని క్లుప్తంగా చూపించారు.మళ్లీ లైవ్లో ఆనందయ్య మందు విషయంలో కనిపించింది.
ఇకపోతే ఆనందయ్య మందు విషయంలో సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈయన కరోనా మందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ కంట్లో వేసే మందు విషయంలో మాత్రం ఇంకా అధ్యయనం కొనసాగుతోందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
అయితే తాజాగా ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు ఓ ఆసక్తికర అంశం వెల్లడించారు.ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థం ఉందని, ఇది కళ్లకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు.
అయితే కోర్టు మాత్రం ఈ విచారణను జులై 1కి వాయిదా వేస్తూ ఈ మందు తాలూకు నివేదికలు తమకు సమర్పించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది.