వందల కోట్ల ఆస్తులపై స్పందించిన హీరోయిన్ ప్రేమ.. నా ఆస్తులు అవేనంటూ?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన ప్రేమకు ప్రేక్షకుల్లో పెరుగుతున్న క్రేజ్ అంతాఇంతా కాదు.తెలుగులో ఈ నటి రీఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్ కావడంతో పాటు మరిన్ని విజయాలను అందుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Star Heroine Prema Comments About Her Assets Details Here Goes Viral In Social M-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రేమ మాట్లాడుతూ తన ఆస్తులు, తనపై వచ్చిన రూమర్లు ఇతర విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

నాకు సింపుల్ గా జీవనం సాగించడమే ఇష్టమని ఆమె అన్నారు.తలలో ఆటిట్యూడ్ ఉంటే సంతోషంగా జీవనం సాగించలేమని ప్రేమ అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రేమకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరగగా ఆమె మాత్రం తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెప్పుకొచ్చారు.

డబ్బులు ముఖ్యం కాదని డబ్బే శాశ్వతం కాదని ప్రేమ అభిప్రాయం వ్యక్తం చేశారు.అవసరానికి సరిపడా డబ్బులు ఉంటే చాలని ఆమె వెల్లడించారు.

నేను ఏ విషయం గురించి మాట్లాడినా బోల్డ్ గా మాట్లాడతానని ఆమె చెప్పుకొచ్చారు.నేను ఉపేంద్రతో ప్రేమలో ఉన్నానని రాశారని అయితే నేను అతనితో ప్రేమలో ఉన్నానో లేదో ఆ వార్తలు రాసిన వాళ్లనే అడగాలని ప్రేమ అభిప్రాయం వ్యక్తం చేశారు.నా దృష్టి కేవలం సినిమాలపై మాత్రమే ఉందని నా ప్రేమ గురించి వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

సక్సెస్ వచ్చిన సమయంలో ఈ తరహా వార్తలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయని అమె పేర్కొన్నారు.ప్రతి విషయానికి నెగిటివ్ పాజిటివ్ ఉంటాయని వాటిని ఎదుర్కోవాలని ప్రేమ చెప్పుకొచ్చారు.బీకామ్ మధ్యలో ఆపేసి సినిమాల్లోకి వచ్చానని ఆమె కామెంట్లు చేశారు.

అప్పట్లో నేను సౌందర్యలో ఎక్కువగా టచ్ లో ఉన్నానని ప్రేమ అన్నారు.నేను ఎక్కువగా ఆలోచించేదానిని కాదని ఆమె కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube