టెస్ట్ మ్యాచ్ ల్లో ఇప్పటి వరకు ఏ జట్టు అత్యధిక పరుగులు చేసిందో తెలుసా మీకు...?!

ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ నుండి కేవలం వన్డే లేదా టీ 20 లే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు.అయితే ఇది వరకు క్రికెట్ అంటే కేవలం టెస్ట్ క్రికెట్ లా ఉండేది.

 Srilanka, India, Higest, Jayasurya, Sachin, Siddu, Azaraddin, Est, One Day, T20-TeluguStop.com

మొత్తం ఐదు రోజులు జరిగే ఈ ఆటలో ఎన్నెన్నో మలుపులు తిరిగి చివరికి విజేత తేలుతుంది.ఇక ఈ ఐదు రోజుల్లో ఆటగాళ్లు ఓపికగా ఎంత ఎండ ఉన్నా సరే తప్పకుండా ఆడాలి.

ఆ విషయం అంత తేలిక విషయమేమీ కాదు.అయితే ఓ వైపు బ్యాట్స్మెన్ క్రిజ్ లో నిలబడి పోయాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు విసుగు పుట్టాల్సిందే మరి.ఈ క్రమంలోనే అనేక మంది శతకాలు, ద్విశతకాలు అలాగే చాలా తక్కువగా త్రిశతకాలు నమోదయ్యాయి.అంతే కాదు ఒకసారి వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా నాలుగు వందలు కూడా కొట్టిన సంగతి తెలిసిందే.

అయితే టెస్టు మ్యాచుల్లో ఏ దేశం జట్టు పై అత్యధిక స్కోరు చేసిందో మీకు తెలుసా.? లేకపోతే తెలుసుకోండి.

1997లో శ్రీలంక టీమిండియా జరిగిన టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు నమోదయ్యాయి.అప్పట్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ టీమ్ ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది.ఆ పర్యటనలో భాగంగా మొదటి టెస్టులో భారత్ బ్యాటింగ్ దిగి 167.3 ఓవర్లు ఆడిన టీమిండియా 537/8 వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.ఇక ఈ మ్యాచ్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజారుద్దీన్ శతకాలను సాధించారు.

ఇక ఆ తరువాత బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక జట్టు టీమిండియా ఆటగాళ్లు కి చుక్కలు చూపించింది.

వారు బ్యాటింగ్ కు దిగిన అప్పటి నుండి మిగిలిన మొత్తం టెస్ట్ సమయాన్ని మొత్తం బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను డ్రాగా ముగించారు శ్రీలంక జట్టు సభ్యులు.ఇక ఈ క్రమంలోనే శ్రీలంక జట్టు ఏకంగా ఎప్పటికీ చెరిగిపోని రికార్డును సృష్టించింది.

కేవలం 48 పరుగులు చేసి ఉండే పెద్ద సెన్సేషన్ క్రియేట్ ఉండేది.ఈ క్రమంలోనే శ్రీలంక జట్టు చివరికి 952/6 స్కోరును నమోదు చేసింది.

ఈ క్రమంలో శ్రీలంక స్టార్ ఆటగాడు సనత్ జయసూర్య త్రి శతకంతో రెచ్చిపోయాడు.ఆ మ్యాచ్లో సనత్ జయసూర్య 340 పరుగులు చేశాడు.

ఆయనతో పాటు అక్కడే ఆటగాడు రోషన్ 225 పరుగులు చేసి క్రీజ్ లో పాతుకుపోయి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.వీరిద్దరు కలిసి రెండో వికెట్ కు ఏకంగా 576 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube