బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైపర్ ఆది ( Hyper Aadi )ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama Company ) కార్యక్రమంలో కొనసాగుతున్నారు.అలాగే ఢీ కార్యక్రమంలో కూడా కొనసాగుతున్నారు.
అయితే ఈయనకు లైఫ్ ఇచ్చినటువంటి జబర్దస్త్( Jabardasth ).కార్యక్రమానికి మాత్రం దూరంగా ఉంటున్నారు.ఇలా హైపర్ ఆది ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూనే మరోవైపు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకుని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఈయన ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ప్రతి ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.అయితే ఈ ప్రోమోలో హైపర్ ఆది కిడ్నాప్ ( Kidnap )చాలా హైలెట్ అయింది అని చెప్పాలి.ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర ఆర్టిస్టులు అందరూ కూడా సందడి చేశారు అయితే ప్రోమో మొదట్లోనే హైపర్ ఆదిని కిడ్నాప్ చేసినట్టు చూపిస్తారు .ఇలా హైపర్ ఆదినీ ఇలా కిడ్నాప్ చేయడానికి కారణం ఏంటి ఎందుకు చేశారు అనే విషయానికి వస్తే.హైపర్ ఆది ఈ మధ్యకాలంలో మహిళల పట్ల డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్న విషయం మనకు తెలిసిందే దీంతో మహిళా సెలబ్రిటీలందరూ కూడా ఈయనని కిడ్నాప్ చేశారు.

ఈ సందర్భంగా హైపర్ ఆదిని విడిచి పెట్టాలి అంటే మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలి అలాగే మహిళల పట్ల రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అంటూ డిమాండ్ చేశారు.అయితే ఆది వారికీ సారీ చెప్పాలి అంటేఆడవాళ్లు మంచిగా ఎంటర్టైన్ చేయాలని చెప్పారు మీరు మంచిగా ఎంటర్టైన్ చేస్తే సారీ ఏంటి పొర్ల దండాలు కూడా పెడతానని ఆది చెప్పారు.దీంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు అదిరిపోయే పర్ఫామెన్స్ చేసినట్టు ప్రోమోలో తెలుస్తోంది.ఏది ఏమైనా మహిళలు అందరూ కలిసి ఇలా ఆదిని కిడ్నాప్ చేసిన సీన్ మాత్రం ప్రోమోకి హైలెట్ అయిందని చెప్పాలి.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలి అంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.