ఉడత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్.. వీడియో వైరల్

ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ విభిన్న జాతుల ఉడుతలు ఉన్నాయి.ఇవి ఆస్ట్రేలియా, అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్ మినహా దాదాపు ప్రతిచోటా నివసిస్తున్నాయి.

 Squrill-cute-expressions-video-viral Squrill,viral Latest, News Viral, Social Me-TeluguStop.com

మీరు వాటిని పార్కులలోనో, చెట్ల వద్దనో చూస్తూ ఉంటాం.అవి నోటికి అందిన గింజలను తింటుంటాయి.

కొంత మంది ఉడతలను పెంచుకోవడానికి కూడా ఇష్టపడుతుంటారు.అవి పెద్దగా ఆహారమేమీ తినవు.

కానీ ఏవైనా గింజలు తింటూ గడిపేస్తాయి.కొంత మంది తాము పెంచుకునే ఉడతలను చెప్పినట్లు వినేలా ట్రైన్ చేస్తుంటారు.

వాటితో ఉండే ఎన్నో మంచి వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.తాజాగా ఓ ఉడుతకు సంబంధించి క్యూట్ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటీవల ట్విట్టర్‌లో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఓ ఉడుత తన దగ్గరలోని ఏవో తినే వస్తువులు ఉన్నాయని వస్తుంది.అక్కడ వేరుశనగ కాయలు ఉంటాయి.

ఎంతో ఆకలితో వాటిని తినడానికి నోటిలో పెట్టుకుంటుంది.కొరికి తిందామంటే అవి గట్టిగా ఉంటాయి.

వాటిని బాగా కొరడానికి ప్రయత్నిస్తుంది.ఇంతలో అకస్మాత్తుగా కెమెరా వైపు చూస్తుంది.

వెంటనే తినడం ఆపేస్తుంది.తనను ఎవరో చూస్తున్నట్లు భావించి, నోటిలో అలాగే వేరు శనగ కాయను ఉంచేస్తుంది.

ఇదే క్రమంలో కాసేపటి తర్వాత తినడం స్టార్ట్ చేస్తుంది.నన్నెందుకు చూస్తున్నారు అనేలా దాని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి.

ఇది పూర్తైన తర్వాత అక్కడి నుంచి ఆ ఉడత వెళ్లిపోతుంది.ఆ ఉడతకు సంబంధించి వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టడంతో అది బాగా వైరల్ అయింది.

ఉడత ఎక్స్‌ప్రెషన్స్ చాలా చూడముచ్చటగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube