ఇంటర్నెట్ వినియోగం పెరిగాక ప్రపంచంలో ఏ మూల ఏ ఆసక్తికర ఘటన జరిగినా, మనకు క్షణాల్లో తెలిసిపోతోంది.చాలా మందికి ఉండే నైపుణ్యాలు మనకు చేరువవుతున్నాయి.
కొంత మంది డ్యాన్స్ చేస్తుంటారు.ఇంకొంత మంది వంటలు చేస్తుంటారు.
తమ తమ ప్రతిభను వీడియోలు చేసి, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా చాలా ఫేమస్ అవుతున్నారు.ఇంకొందరికి సోషల్ మీడియా నాలెడ్జ్ లేకపోయినా, వారి ప్రతిభను ఇంకొందరు వీడియోలు తీసి నెట్టింట్లో పెట్టడం వల్ల కూడా చాలా మంది గురించి నెటిజన్లకు తెలుస్తోంది.
తాజాగా ఓ మహిళ పిడకలు కొట్టే తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.అందులో ఓ మహిళ తన చేతిలోకి పేడ ముద్ద తీసుకుని గోడపై పిడకలు కొడుతోంది.
అందులో ఆమె పిడకలు కొట్టే విధానం చాలా ఆసక్తిగా కనిపిస్తోంది.ఆ మహిళ అప్రయత్నంగా ఎత్తైన గోడపై ఆవు పేడ పిడకలను గురిపెట్టి వేస్తోంది.15 అడుగుల ఎత్తు ఉండే గోడ నిచ్చెన వేసుకుంటేనే కానీ అందదు.చాలా గ్రామాల్లో ఎత్తైన గోడలపై పిడకలు కొట్టేందుకు నిచ్చెన సాయం తీసుకుంటారు.
అలా ఓ క్రమ పద్ధతిలో వరుసగా పిడకలు కొడుతుంటారు.అయితే ఈ మహిళ మాత్రం ఎలాంటి నిచ్చెన వంటి సాయం తీసుకోలేదు.
అయినప్పటికీ చక్కటి వరుసలో పై నుంచి క్రింది వరకు చేతితో విసురుతూ చక్కగా పిడకలు కొడుతోంది.ఈ మహిళ ప్రతిభకు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
అవనీష్ శరణ్ తన పోస్ట్‌కి చమత్కారమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు.భారత బాస్కెట్‌బాల్ జట్టు ఆమె కోసం వెతుకుతోంది అని అతను రాశాడు.