శ్రీకాకుళం జిల్లా. బూర్జ మండలంలో వైసీపీ విజయోత్సవ సభ.
ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్ తమ్మినేని సీతారాం. పాల్గొన్న నూతనంగా ఎన్నికైన జెడ్పిటిసి, ఎంపిపి, ఎంపిటిసిలు.
స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్.
బూర్జ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ప్రజలు 8 స్థానాల్లో వైసీపీని గెలిపించారు. టిడిపి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో పక్షపాత ధోరణి ఉండకూడదని సీఎం జగన్ ఎప్పుడూ చెప్తుంటారు.
తెలుగుదేశం నాయకులు బుద్ధిలేని వాళ్ళు కాబట్టే పక్షపాత ధోరణిలో వెళ్లారు.అందుకే ప్రజలు వాళ్ళను ఓడించారు.ప్రజలు మన తప్పుల్ని గమనిస్తూ, ఒప్పుల్ని పరిశీలిస్తూ ఉంటారు.
సమయం వచ్చినప్పుడు మన పని పట్టేస్తారు.
రెండేళ్ళ జగన్ పాలనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రతిఫలం.ఎన్నికల ముందు మేము అధికార పార్టీని నిలదీస్తాం, కడిగేస్తాం అని టిడిపి నేతలు గంటలు మోగించారు.
అలాంటిది జిల్లాలో ఒక్క జెడ్పిటిసి కూడా గెలవలేదు.జిల్లా పరిషత్ లో అడగడానికి ఒక్కడు లేడు.
జిల్లాలో స్వపక్షం, విపక్షం రెండూ వైసిపినే.