వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మినీ వెర్షన్ ‘వందే మెట్రో’ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.కేంద్ర బడ్జెట్ లో రైల్వేశాఖకు గతంలో ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నగరాల నుంచి సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
వందే భారత్ తరహాలోనే వందే మెట్రోలనూ అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు.
ఈ క్రమంలో వీటి రూపకల్పన, తయారీ ఈ సంవత్సరంలోనే పూర్తి అవుతుందని పేర్కొన్నారు.వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
వందే మెట్రోల్లో ఎనిమిది బోగీలు ఉంటాయన్న ఆయన నగరాలకు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు రాకపోకలు సాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.