స్కిల్ డెవలప్ మెంట్ కేసు..విజయవాడ ఏసీబీ కోర్టులో హోరాహోరీ వాదనలు

విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై విచారణ కొనసాగుతోంది.ఈ మేరకు హోరాహోరీగా ఇరు పక్షాల వాదనలు సాగుతున్నాయి.ఈ క్రమంలోనే కేసులో 409 సెక్షన్ తీసుకురావడంపై చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.

 Skill Development Case..hearty Arguments In Vijayawada Acb Court-TeluguStop.com

409 సెక్షన్ పెట్టాలంటే సరైన ఆధారాలు చూపాలని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు.రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలన్న ఆయన 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరు పరచాలని పేర్కొన్నారు.అయితే సీఐడీ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని సిద్దార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు.

అటు సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.నిన్న ఉదయం ఆరు గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని, 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టామని ఆయన న్యాయస్థానానికి తెలిపారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు.

అయితే విచారణ నేపథ్యంలో కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యమైందన్న న్యాయమూర్తి చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేదని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube